బాపుబొమ్మ ప్రెగ్నెన్సీ పిక్స్.. ఆనందిస్తున్న అభిమానులు

     Written by : smtv Desk | Mon, May 23, 2022, 08:21 AM

బాపుబొమ్మ ప్రెగ్నెన్సీ పిక్స్.. ఆనందిస్తున్న అభిమానులు

పెద్దపెద్ద కళ్ళతో ముద్దుగారే మోముతో అచ్చు బాపుగీసిన బొమ్మలా ఉంటుంది హీరోయిన్ ప్రణీత సుభాష్. ఏం పిల్లో ఏం పిల్లడో సినిమా తో తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయమైనా ప్రణీత సుభాష్ రెండవ సినిమా బావ తో మంచి గుర్తింపు దక్కించుకుంది. సిద్దార్థ్ హీరోగా తెరకెక్కిన బావ చిత్రం ప్లాప్ అయినప్పటికీ కూడా తెలుగు ఆడియన్స్ దృష్టిలో అలాగే ఫిల్మ్ మేకర్స్ దృష్టిలో పడింది ప్రణీత. ఆ తర్వాత తెలుగు, తమిళం, కన్నడం భాషల్లో వరుసగా సినిమాలు చేసి ఒక దశాబ్ద కాలం పాటు బిజీ బిజీగా గడిపింది ఈ అమ్మడు.
తెలుగు లో ప్రణీత పవన్ కళ్యాణ్ తో కలిసి నటించిన 'అత్తారింటికి దారేది' చిత్రంతో మరింత గుర్తింపు దక్కించుకుంది. అత్తారింటికి దారేది చిత్రం తర్వాత మరింత బిజీగా సినిమాలు చేసింది. సినిమా ల్లో ఎంట్రీ ఇచ్చి పుష్కర కాలం అయినా కూడా వరుసగా సినిమాలు చేస్తూ ఉంది. అయితే ప్రణీత తాజాగా తాను గర్భవతిని అంటూ ప్రకటించింది.
ఇటీవలే తల్లిని కాబోతున్నాను అంటూ ప్రకటించిన ప్రణీత వరుసగా తన బేబీ బంప్ ఫోటోలు షేర్ చేస్తూ వచ్చింది. తాజాగా తన భర్తతో కలిసి క్యూట్ ఫోటోలను షేర్ చేసింది. భర్తతో కలిసి ప్రణీత ఇచ్చిన ఫోటోల ఫోజ్ లు అందరిని ఆకర్షిస్తున్నాయి. క్యూట్ ప్రణీత ఈ ఫోటోలో మరింత అందంగా కనిపిస్తుంది అంటూ ఫ్యాన్స్ కూడా కామెంట్స్ చేస్తున్నారు.
పోయిన సంవత్సరం హంగామా 2 మరియు భుజ్ చిత్రాలతో ఆడియన్స్ ముందుకు వచ్చిన ప్రణీత ఈ సారి రామణ అవతార్ అనే చిత్రంతో ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ప్రసవం తర్వాత కూడా వరుస చిత్రాలను చేసే ఉద్దేశ్యంతో ఉన్నట్లుగా ప్రణీత ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. సోషల్ మీడియాలో 5 మిలియన్ ల ఫాలోవర్స్ ను దక్కించుకున్న బాపుబొమ్మ హీరోయిన్ గా మరిన్ని మంచి మంచి చిత్రాలు చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.





Untitled Document
Advertisements