భారత్ కు పాక్ మాజీ ప్రధాని ప్రశంసలు

     Written by : smtv Desk | Mon, May 23, 2022, 10:32 AM

భారత్ కు పాక్ మాజీ ప్రధాని ప్రశంసలు

పాకిస్తాన్ లో అసమ్మతి సెగల వల్ల ఇమ్రాన్ ఖాన్ తన ప్రధాన మంత్రి పదవిని కోల్పోవాల్సి వచ్చిన విషయం తెలిసిందే .. ప్రజలలో ఆయనకు వచ్చిన వ్యతిరేకత వల్ల ప్రధాని నుంచి మాజీ ప్రదాని అయ్యారు. అయితే ఇమ్రాన్ ఖాన్ మాత్రం ఎప్పుడు భారత్ పై నిప్పులు చెరిగే ఈయన ..ఈసారి భారత విధానాలను ప్రశంసిస్తూ అందరిని ఆశ్చర్యంలోకి నేట్టేసారు. పాకిస్తాన్ కు అమెరికాకు మద్య ఉన్న వైఖరి గురించి తెలిసిందే .. అయితే అగ్రరాజ్యం అమెరికాకు ఏ విధంగా భయపడకుండా భారత్ రష్యా నుండి అతితక్కువ ధరలకే చమురు ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటుందని ప్రశంసించారు. అంతేకాకా తన పాలనలో పాకిస్తాన్ లో విదేశంగా విదానం సరిగ్గా పని చేసిందని తన పాలనను సమర్థించుకున్నారు. అంతేకాక ప్రస్తుతమున్న ప్రభుత్వం పై నిప్పులు చెరిగారు. నేడు పాకిస్తాన్ లో ఉన్న ప్రభుత్వం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా ద్వంసం అయ్యేలా ఉందని తన ట్వీట్ లలో పేర్కొన్నారు. అంతేకాక దేశ ఆర్థిక వ్యవస్థ పరిస్థితి తల లేని కోడి లాగా అయిపొయింది అని వ్యాఖ్యానించారు. అయితే ఇమ్రాన్ ఖాన్ భారత్ ను సపోర్ట్ చేయడం ఎంతని అందరు విస్చిత్తులై చూస్తున్నారు. అయితే ఆయన ఈ మద్య చాలా స్పీచ్ లలో ఇప్పుడు పాకిస్తాన్ లో ఉన్నది అమెరికా తొత్తు తొత్తు ప్రభుత్వం అని పేర్కొనడం జరిగింది . అయితే తన వాదనలను కొనసాగిస్తూ పాక్ ప్రధాని మరియు అమెరికా లను హెచ్చరించడం జరిగింది.


https://twitter.com/ImranKhanPTI/status/1528059598145454083?s=20t=gJaG62Wdsu7447T-tnX80Q





Untitled Document
Advertisements