విజయంతో జర్నీ ముగించిన పంజాబ్ ..

     Written by : smtv Desk | Mon, May 23, 2022, 10:34 AM

విజయంతో జర్నీ ముగించిన పంజాబ్ ..

ఐపిఎల్ 2022 సీజన్లో భాగంగా ఆదివారం నాడు సన్‌రైజర్స్ హైదరాబాద్‌ మరియు పంజాబ్ కింగ్స్ ల మత్చ్ తో లీగ్ మ్యాచ్లు అన్ని ముగిసినట్టే ..ఇప్పటికే సీజన్లో అనుకోని రీతిలో ఈసారే అరంగేట్రం చేసిన జత్లూ ప్లే ఆప్స్ కి క్వాలిఫై అయ్యిన విషయం తెలిసిందే ..అయితే ఈ మ్యాచ్ కి సన్‌రైజర్స్ హైదరాబాద్‌ జట్టు కెప్టెన్ కెన్ విల్లియంసన్ అందుబాటులో లేకపోవడంతో భువనేశ్వర్ కుమార్ కెప్టెన్ గా వ్యవహరించాడు. అయితే ఈ మ్యాచ్ లో టాస్ గెలిసి హైదరాబాద్ జట్టు బ్యాట్టింగ్ ఎంచుకోగా ముంబయి వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్ భువనేశ్వర్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఓపెనర్ అభిషేక్ శర్మ 43 పరుగులు చేయగా ఇమ్గిలిన బ్యాట్స్మెన్ లు అందరు తక్కువ పరుగులకే పెవిలియన్ బాట పట్టారు. టాప్ బ్యాట్స్మెన్ లు ప్రియమ్ గర్గ్ 4 , త్రిపాఠి 20 , మర్కరమ్ 21 , పూరన్ 5 పరుగులకే పరిమితం అయ్యారు. ఆఖర్లో వాషింగ్టన్ సుందర్ 25 , రొమారియో షెఫర్డ్ 26 పరుగులు చేసి జట్టుని ఇరవై ఓవర్లకి 157 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ ముందుంచగలిగారు. పంజాబ్ కింగ్స్ జట్టు 157 పరుగుల లక్ష్యాన్ని సులభంగానే చేదించింది. ఓపెనర్ జానీ బెయిర్ స్టో 23 మయాంక్ అగర్వాల్ 4 శిఖర్ ధావన్ 39 పరుగులు చేసాడు. జితేశ్ శర్మ 7 బంతుల్లో మూడు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 19 పరుగుల దూకుడు ఇన్నింగ్స్ ను కొనసాగించి అవుట్ అయ్యాడు. మరో బ్యాట్టేర్ లియమ్ లివింగ్‌స్టన్ ఈ మ్యాచ్ లో తన బ్యాట్టింగ్ శైలిలో మల్లి అందరిని అబ్బురపరిచాడు. కేవలం 22 బంతుల్లో రెండు ఫోర్లు, ఐదు సిక్సర్లతో విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగి 49 పరుగులతోపంజాబ్ జట్టుకు విజయాని అందించాడు. ఈ ఐపిఎల్ సీజన్లో పంజాబ్ విజయంతో ప్రయాణాన్ని ముగించింది.






Untitled Document
Advertisements