తెల్లజుట్టు మిమ్మల్ని వేదిస్తుందా అయితే ఇలా చేయండి

     Written by : smtv Desk | Mon, May 23, 2022, 11:20 AM

తెల్లజుట్టు మిమ్మల్ని వేదిస్తుందా అయితే ఇలా చేయండి

ప్రస్తుతకాలంలో మారిన జీవనశైలీ, వాతావరణ కాలుష్యం కారణంగా వయసుతో సంబంధం లేకుండా దాదాపు ప్రతి ఒక్కరిని జుట్టు రాలిపోవడం మరియు తెల్లజుట్టు సమస్య వేధిస్తుంది. సరైన జీవన విధానం లేకపోవడం, హార్మోనల్ ఇన్ బ్యాలెన్స్ వల్ల కూడా జుట్టు తెల్లబడే అవకాశాలు లేకపోలేదు. అయితే ఈ సమస్యకు పరిష్కరం లేదు అని చాలా మంది భాదపడడం చూస్తూనే ఉంటాము. కానీ నిజానికి కొన్ని హెయిర్ కేర్ హ్యాబిట్స్‌ని అనుసరిస్తే డైట్ లో కొన్ని మూలికలు వంటివి తీసుకున్నా సరే జుట్టు పండిపోకుండా ఉంటుంది. దీనితో జుట్టు ఎంతో అందంగా ఉంటుంది. అయితే మరి ఎలాంటి వాటిని అనుసరించడం వల్ల జుట్టు బాగుంటుంది అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం.
ఉసిరి :- ఉసిరి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. చర్మానికి కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రతి రోజు ఒక ఉసిరికాయ తీసుకుంటే జుట్టు నల్లగా కూడా ఉంటుంది. వీటితో పాటుగా మెటబాలిజంని కరెక్ట్ గా ఉంచుతుంది. అదే విధంగా ఒంట్లో ఉండే చెడు పదార్థాలను కూడా ఇది తొలగిస్తుంది. కాబట్టి రెగ్యులర్ గా ఉసిరిని తీసుకోండి. ఆయుర్వేద వైద్యంలో కూడా ఉసిరిని ఎక్కువగా వాడుతూ ఉంటారు. అదే విధంగా మీ తలని అంతటిని కూడా కొబ్బరి నూనె‌తో మసాజ్ చేయటం మంచిది. ఆ తర్వాత ఉసిరి జ్యూస్‌ని తలకు అప్లై చేసుకోండి ప్రతి రోజు మీరు ఆమ్లా జ్యూస్‌ని కూడా తాగవచ్చు. లేదంటే ఉసిరిపొడిని కూడా తలకి అప్లై చేస్తూ ఉండచ్చు.
కరివేపాకు :- మనం వంటల్లో కరివేపాకు ఎక్కువగా వాడుతూ ఉంటాము. కరివేపాకు వల్ల ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుంది. జుట్టు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. అయితే కరివేపాకు ఎలా ఉపయోగించాలి..?, కరివేపాకును ఉపయోగించడం వలన ఏమవుతుంది..? అనే దాని గురించి చూద్దాం.
సాధారణంగా కరివేపుకుని వంటల్లో వాడడం మనకి తెలిసిందే. కరివేపాకు ఆరోగ్యానికి ముఖ్యంగా కంటిచూపుకి ఎంతో మంచిది. అయితే ఆరోగ్యంతో పాటు అందానికి కూడా కరివేపాకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎలా అనేది ఎప్పుడు తెలుసుకుందాం
ఒకటి లేదా రెండు కప్పులు కొబ్బరి నూనె తీసుకొని అందులో గుప్పెడు కరివేపాకులను వేయండి. దీన్ని బాగా మరిగించి నూనె మొత్తం నల్లగా మారె వరకూ ఉంచండి. ఈ మిశ్రమం చల్లారిన తరువాత ఒక గాజు సీసా లో వేయండి. ఈ నూనెను తలకు బాగా పట్టించి.. రాత్రంతా అలా వదిలేసి ఉదయాన్నే షాంపూతో తల స్నానం చేయండి. షాంపూ ని ఉపయోగించేటప్పుడు మైల్డ్ షాంపూ అయ్యేటట్టు చూసుకోండి. ఇది కూడా మీకు చక్కటి ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి దీన్ని కూడా మీరు ట్రై చేయొచ్చు.
బృంగరాజ్ :- బృంగరాజ్ జుట్టుకి రాజు. బృంగరాజ్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఆయుర్వేద వైద్యం లో కూడా దీనిని ఎక్కువగా వాడుతూ ఉంటారు. ముఖ్యంగా జుట్టు తెల్లబడకుండా ఇది చూస్తుంది. అదే విధంగా మెటబాలిజంను ఇది కరెక్ట్ చేస్తుంది. జుట్టు రాలడం కూడా తగ్గుతుంది. బృంగరాజ్ ని మీరు తలకు అప్లై చేసుకుని ఒక అర గంట పాటు అలా వదిలేసి ఆ తర్వాత తలని శుభ్రంగా కడిగేసుకోండి లేదు అంటే షాంపూ స్నానం చేసే ముందు మీరు కొంచెం నూనె తో మసాజ్ చేసుకోండి ఈ విధంగా వారానికి రెండు సార్లు అనుసరిస్తే చక్కటి ఫలితం మీరు పొందొచ్చు. జుట్టు తెల్లబడకుండా ఉండాలంటే ఈ టిప్ ని కూడా ఫాలో అవ్వండి. అ
జుట్టు సంరక్షణ కొరకు కొన్ని చిట్కాలు ..
ఆయిల్ పెట్టుకోవడం తలకి చాలా ముఖ్యం. కాబట్టి వారానికి రెండు సార్లు తలకు ఆయిల్ పెట్టండి.
ఎక్కువగా సాల్ట్, ఫ్రైడ్, కెఫిన్, నాన్ వెజ్ ఫుడ్ ని తీసుకో వద్దు.
ఎక్కువగా మీరు తియ్యగా మరియు చేదుగా ఉన్నవి తీసుకుంటే మంచిది.
ప్రతి రోజు రాత్రి నిద్రపోయే ముందు రెండు చుక్కలు ఆవు నెయ్యి ముక్కులో వేసుకోండి.
అలానే ఉసిరిని ఉపయోగిస్తే మంచిది. ఇది జుట్టు తెల్లగా అయ్యిపోకుండా చూస్తుంది. ముఖ్యంగా చలి కాలంలో దీన్ని తీసుకోండి.
ప్రతి రోజు రాత్రి త్వరగా నిద్ర పోవడం కూడా చాలా ముఖ్యం. మీరు ఎంత బాగా నిద్ర పోతే జుట్టు అంత ఆరోగ్యంగా ఉంటుంది.
ప్రతి రోజూ 10 గంటల కంటే ముందే పడుకోవడం అలవాటు చేసుకోండి.
కొబ్బరి నూనె లో కూలింగ్ గుణాలు ఉంటాయి. కాబట్టి దీన్ని ఎక్కువగా ఉపయోగించండి. అలాగే కొబ్బరి నూనె తో పాటు వీటిని కూడా ఉపయోగించవచ్చు. కింద తెలిపినవి కూడా ఉపయోగించవచ్చు..
* అలోవెరా జెల్ లో కొంచెం కొబ్బరి నూనె వేసి జుట్టుకు అప్లై చేస్తే చాలా బాగుంటుంది. పైగా ఇదేమీ కష్టమైనా పని కాదు. ఎంతో ఈజీగా మనం ఈ ప్రాసెస్ ని ఫాలో అయ్యిపోవచ్చు. కనుక అలోవెరా జెల్ తో ఈ విధంగా మీరు అనుసరించచ్చు. దీనితో మంచి మార్పుని మీరు పొందొచ్చు.
* రెండు టీ స్పూన్ల ఉసిరి పొడిని మూడు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనెలో కలిపి తలకు అప్లై చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చాలా చక్కటి ఫలితాన్ని మీరు పొందొచ్చు.
* కరివేపాకుని కొబ్బరి నూనె లో వేసి మరిగించాలి. చల్లారిన తర్వాత దీన్ని తలకు అప్లై చేయాలి. అదే విధంగా మీరు డైట్ లో కరివేపాకు ఎక్కువగా ఉపయోగించండి. ఎందుకంటే ఇందులో మల్టీ విటమిన్స్ ఉంటాయి. అలాగే ఐరన్ కూడా ఎక్కువగా ఉంటుంది. జుట్టు తెల్లబడకుండా కూడా ఇది చక్కగా పనిచేస్తుంది.
* అదేవిధంగా మీరు కరివేపాకు తో పాటు ఉసిరి, కాకర, ఆవు నెయ్యిని కూడా డైట్‌లో తీసుకుంటూ ఉండండి. ఇలా కూడా మీరు చక్కటి ఫలితాన్ని పొందవచ్చు.
* మీరు తల స్నానం చేసినప్పుడు వేడి నీటితో చేయకుండా చల్లటి లేదా గోరువెచ్చని నీటితో తలస్నానం చేయడం మంచిది. ఈ చిట్కాలను కనుక ప్రయత్నిస్తే కచ్చితంగా జుట్టు నల్లగా ఉంటుంది. జుట్టు ఎంతో అందంగా ఉంటుంది.





Untitled Document
Advertisements