అదానిని కలవడానికి అంత దూరం వెళ్ళాలా ..? నారా లోకేష్

     Written by : smtv Desk | Mon, May 23, 2022, 12:00 PM

అదానిని కలవడానికి అంత దూరం వెళ్ళాలా ..? నారా లోకేష్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి స్విట్జర్లాండ్ దావోస్ నగరంలో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం కు ప్రయాణం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో చర్చనీయంగా మారిన విషయం తెలిసిందే. దీనికి కారణం జగన్ లండన్ లో విమానం దిగడమే ..లేట్ ప్రతిపక్ష నేతలంతా జగన్ దావోస్ కు వెళ్ళడం లేదని ఆయన పై వ్యాఖ్యలు చేస్తూనే వచ్చారు. అయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ స్విట్జర్లాండ్ దావోస్ నగరానికి చేరుకోప్ని ఆదివారం పలువురు ప్రముఖులతో సమావేశమయ్యారు. ఇందులో భాగంగా డబ్ల్యూఈఎఫ్ వ్యవస్థాపకుడు క్లాజ్ ష్వాప్ తో సమావేశమయ్యి రల్డ్ ఎకనామిక్ ఫోరం ప్లాట్ ఫాం పార్టనర్ గా ఒప్పందం కుదుర్చుకున్నారు. అనంతరం వరల్డ్ ఎకనామిక్ ఫోరం వైద్య విభాగాధిపతి డాక్టర్ శ్యాం బిషేన్తోనూ సమావేశమయ్యి కరోనా సమయంలో తాము తీసుకున్న జాగ్రత్తలు వివిధ అంశాలపై చర్చలు జరిపారు. ప్రముఖ వ్యాపారవేత్త అదానీ గ్రూపు సంస్థల చైర్మన్ గౌతం అదానీతో ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడుల పై చర్చలు జరిపినట్లు సమాచారం . అయితే ఆంధ్రా ముఖ్యమంత్రి జగన్ వ్యాపారవేత్త అదానిని కలవడం పై తెలుగుదేశం పార్టీ అగ్రనేత నారా లోకేష్ విమర్శలు కురిపించారు. జగన్ దావోస్ లో అదానిని తప్ప ఇంకేవారిని కలవలేదని.. కేవలం ఒక వ్యాపారవేత్తని కలవడానికి అక్కడి వరకు వెళ్ళాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. కేవలం తన స్వంత ప్రయోజనాల కోసమే అదానిని కలిసారన్నారు. అంతేకాక ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాటలాడిన వారిపై అక్రమకేసుల అంశాన్ని వివరిస్తూ తాను ఎలాంటి కేసులకు భయపడే వాడిని కాదని స్పష్టం చేసారు.





Untitled Document
Advertisements