భారత్ తో పాటు మరో 15 దేశాల్లోనూ ప్రయాణించకుండా ఆంక్షలు.. సౌదీ

     Written by : smtv Desk | Mon, May 23, 2022, 12:13 PM

భారత్ తో పాటు మరో 15 దేశాల్లోనూ ప్రయాణించకుండా ఆంక్షలు.. సౌదీ

సౌదీ ప్రభుత్వం అక్కడి జాతీయులు భరత్ లో ప్రయాణించకుండా ఆంక్షలు విధించింది. భారత్ తో పాటు సౌదీ జాతీయులు మరో 15 దేశాల్లోనూ ప్రయాణించకుండా ఆంక్షలు విధిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. మరో 15 దేశాల జాబితాలో లెబనాన్, సిరియా, టర్కీ, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, యెమెన్, సోమాలియా, ఇథియోపియా, కాంగో, లిబియా, ఇండోనేషియా, వియత్నాం, ఆర్మీనియా, బెలారస్, వెనెజులా దేశాల పేర్లు ఉన్నాయి.
ఈ నిర్ణయానికి గల కారణాలు ఏంటి అంటే ఆంక్షలు విధించిన దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయంటూ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ పాస్ పోర్ట్స్ ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. ఈ దేశాలకు వెళ్లేందుకు సౌదీ అరేబియా పౌరులను అక్కడి ప్రభుత్వం అనుమతించదు. అయితే, సౌదీకి భారతీయులు రావడంపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. వాస్తవానికి మన దేశంలో కరోనా కేసులలో పెరుగుదల ఏమీ లేదు. అవి దాదాపు కనిష్ఠ స్థాయుల్లోనే కొనసాగుతున్నాయి. అస్పష్ట సమాచారం, అవగాహన లోపంతో సౌదీ ఈ నిర్ణయం తీసుకుంది అనే అభిప్రాయం వెలువడుతుంది.





Untitled Document
Advertisements