చండీగఢ్ లో చెక్కుల పంపిణిలో సీఎం కెసిఆర్ సంచలన వ్యాఖ్యలు ..

     Written by : smtv Desk | Mon, May 23, 2022, 12:54 PM

చండీగఢ్ లో చెక్కుల పంపిణిలో సీఎం కెసిఆర్ సంచలన వ్యాఖ్యలు ..

తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు ఇటివలే ఢిల్లీ చేరుకున్న సంగతి తెలిసిందే. అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి వ్యతిరేఖంగా దేశవ్యాప్తంగా ముఖ్యనేతలతో సమావేశాలకు సిద్దమయ్యి ఢిల్లీకి పయనమయ్యారు. అక్కడి నుండి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, పంజాబ్‌ సీఎం భగవంత్ మాన్‌లతో సమావేశం ముగించుకొని చండీగఢ్ లో కేంద్రం తెచ్చిన నల్ల రైతుచట్టాలకు వ్యతిరేఖంగా పోరాడిన రైతుకుటుంబాలకు ఒక్కో కుటుంబానికి మూడు లక్షల చొప్పున చెక్కులను అందజేశారు. అయితే ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో బీజేపి అధికారంలోకి వచ్చినప్పటి నుండి రైతుల పరిస్థితి చాలా ఆర్థికంగా వెనకబడిపోయిందని పేర్కొన్నారు. అయితే భగత్ సింగ్ వంటి గొప్ప వ్యక్తులు పుట్టిన పంజాబ్ లో నుండి రైతులు ప్రాణాలకు లెక్కచేయకుండా పోరాడి వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకునేలా చేసారని అభినందనలు తెలియజేసారు. అంతేకాక దేశంలో రైతంగాన్న్ని వెనక్కి నెట్టేందుకు కేంద్రం వ్యవసాయ భూములలలో కరెంటు మీటర్లు తీసుకొస్తుందని దీనికి వ్యతిరేఖంగా కూడా అందరు కలిసి పోరాడాలని పిలుపునిచ్చారు. రైతులకు తాము ఫ్రీ గా కరెంటు అందిస్తూ వ్యవసాయాన్ని ప్రోత్సాహిస్తుంటే అది కేంద్ర ప్రభుత్వానికి నచ్చకనే ఇలా ఆంక్షలు విధిస్తుందని పేర్కొన్నారు. ఇక తెలంగాణలో 8గంటల నుండి 24 గంటల ఫ్రీ కరెంటు ఇస్తున్నామని తెలియజేస్తూ.. తమ ప్రాణాలు పోయినా సరే వ్యవసాయభూములలో మీటర్లు పెట్టించే ప్రసక్తే లేదన్నారు కెసిఆర్ .







Untitled Document
Advertisements