దావోస్ లో ఆంధ్ర ప్రదేశ్ వైద్య ఆరోగ్య అంశాలపై ప్రసంగించిన సీఎం జగన్..

     Written by : smtv Desk | Mon, May 23, 2022, 01:59 PM

దావోస్ లో ఆంధ్ర ప్రదేశ్ వైద్య ఆరోగ్య అంశాలపై ప్రసంగించిన సీఎం జగన్..

స్విట్జర్లాండ్లోని దావోస్ నగరంలో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ పనితీరు వివరిస్తూ ప్రసంగాన్ని కొనసాగించారు.అయితే దీనిలో భాగంగా కరోనా కట్టడి సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ముందు జాగ్రత్త చర్యలను వివరిస్తూ అత్యధిక జనాభా ఉన్న గ్రామాలలో విలేజ్ క్లినిక్ లతోపాటు ఏరియా ఆస్పత్రులను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. అంతేకాక ఇంటింటికి సర్వే నిర్వహించడం వల్ల కరోనా బారిన పడ్డ వారిని తొందరగానే గుర్తించామని.. వారిని దగ్గరలోని ఐసోలేషన్ సెంటర్ కు తరలించడం ద్వారా నాణ్యమైన చికిత్స అందించామని తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముందు 11 మెడికల్ కాలేజీలు ఉండగా జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత మరో 16 మెడికల్ కాలేజీల ఏర్పాటు చేయనున్నట్లు తెలపడంజరిగింది. అంతేకాక భారత్లో కేంద్రంలో అధికారంలో ఉన్నా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ పథకం కంటే ఆంధ్రప్రదేశ్లో వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రెండు వేలకు పైగా వ్యాధులకు సంబంధించిన చికిత్సలు రాష్ట్రంలో అందజేస్తున్నామని తెలియజేయడం జరిగింది . అంతేకాక రాబోయే రోజులలో ఆంధ్రప్రదేశ్లో వైద్య ఆరోగ్య రంగాన్ని మరింత అభివృద్ధి చేస్తామని దానికి భవిష్యత్తు కార్యచరణ ఇప్పటికే రూపుదిద్దుకుందని జగన్ వెల్లడించారు.





Untitled Document
Advertisements