కొండాపూర్ ఏరియా ఆసుపత్రి ఆకస్మిక తనిఖీ.. అవినీతికి పాల్పడిన వైద్యుడి సస్పెండ్

     Written by : smtv Desk | Mon, May 23, 2022, 03:05 PM

 కొండాపూర్ ఏరియా ఆసుపత్రి ఆకస్మిక తనిఖీ.. అవినీతికి పాల్పడిన వైద్యుడి సస్పెండ్

తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి మరియు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు వైద్య ఆరోగ్య శాఖ బాధ్యతలు చేపట్టినప్పటి నుండి పలు ఆసుపత్రులలో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే . అయితే ఈ రోజు ఆకస్మికంగా కొండాపూర్లోని ఏరియా ఆస్పత్రిని సందర్శించారు .అక్కడ ఆస్పత్రిలో సిబ్బంది పనితీరు గురించి ఆరా తీశారు అయితే ఒక వైద్యుడు డ్రైవింగ్ లైసెన్స్ ఫిట్నెస్ సర్టిఫికెట్ కోసం లంచం అడిగిన విషయం తెలుసుకొని అధికారిని అక్కడికక్కడే సస్పెండ్ చేయడం జరిగింది .ఈ విషయాన్ని నేరుగా వైద్యఆరోగ్యశాఖ ట్విట్టర్ అకౌంట్లో పేర్కొనడం జరిగింది. అంతేకాక హరీష్ రావు ఆస్పత్రిలోని అన్ని విభాగాలను సూక్ష్మంగా పరిశీలించారు అనంతరం . ఆసుపత్రికి చికిత్స కోసం వచ్చిన రోగులతో సంభాషించారు. చికిత్సకు సంబంధించిన విషయాలు మరియు సిబ్బంది యొక్క పనితీరు ఇంకా పని విధానాల గురించి అడిగి తెలుసుకున్నారు .





Untitled Document
Advertisements