క్రికెట్ ఆటగాడు సిద్దూకి అస్వస్థత ఆస్పత్రికి తరలింపు

     Written by : smtv Desk | Mon, May 23, 2022, 03:40 PM

క్రికెట్ ఆటగాడు సిద్దూకి అస్వస్థత ఆస్పత్రికి తరలింపు

టీమ్ ఇండియా మాజీ క్రికెట్ ఆటగాడు పంజాబ్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు నవజ్యోత్ సింగ్ సిద్దు మరోసారి వార్తల్లోకి వచ్చాడు. గతంలో 1998 లో జరిగిన సంఘటన ఆదారంగా ఆయనకు ఒక సంవత్సరం జైలు శిక్షను సుప్రీమ్ కోర్టు విధించింది. అయితే దాదాపుగా 30 ఏళ్ల క్రితం సిద్దు మరియు అతని స్నేహితుడు కలిసి చేసిన ఘటనకు ఆయనకు ఈ శిక్ష పడింది. అయితే గతంలో సిద్దు మరియు అతని స్నేతుడు కలిసి రోడ్డు మీద ఒక వృద్దుడిని చితకబాదారు. అయితే ఆయన అక్కడికక్కడే మరణించడం తో పరిస్థితి ఇప్పటి వరకు వచ్చింది. అప్పట్లో ఈ కేసులో అయితే బాదితుని కుటుంభ సభ్యులు కోర్టుకు ఎక్కడంతో 1999లో సిద్దు మరియు అతని స్నేహితునికి కేవలం వెయ్యి రూపాయల జరిమానా విధించి నిర్దోషులుగా ప్రకటించింది. అయితే భాదితుల కుటుంబం మాత్రం అసలు తగ్గకుండా సుప్రీమ్ కోర్టులో రివ్యూ పెటిషన్ వేయడం తో క్రికెటర్ సిద్దుకు మల్లి చుక్కెదురైంది . అయితే ఈ కేసు విషయంలో విచారణ చేపట్టిన సుప్రీమ్ కోర్టు రివ్యూ జరిపి నవజ్యోత్ సింగ్ సిద్దుకు ఒక సంవత్సర కాలం పాటు జైలు శిక్షను విధించింది. అయితే నవ్జ్యోత్ సింగ్ సిద్ధూ కోర్టులో లొంగిపోయిన ఆయనకు మొదటిరోజు జైల్లో రోటీ మరియు పప్పు ఆహారంగా తీసుకోగా ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. కాగా సిద్దు ఇంతకుముందే కాలేయం మరియు రక్తం గడ్డ కట్టడం వంటి వ్యాధులతో బాధపడుతున్న డంతో ఆయన లాయర్ కోర్టును ఆశ్రయించగా ఆరోగ్య రీత్యా ఆయనకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలని కోర్టును కోరారు అయితే ప్రస్తుతం సిద్ధుని జైలు నుంచి ఆస్పత్రికి తరలించడం జరిగింది ఆసుపత్రికి వచ్చిన తర్వాత ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అనేది ఇంకా వెళ్లడి కాలేదు.





Untitled Document
Advertisements