ఇలా చేస్తే మెరిసే జుట్టు మీసొంతం..

     Written by : smtv Desk | Mon, May 23, 2022, 04:09 PM

ఇలా చేస్తే మెరిసే జుట్టు మీసొంతం..

పార్టీ, ఫంక్షన్.. పెళ్ళి, పేరంటం అకేషన్ ఏదైనా సరే అందంగా అలంకరించుకుని పదిమందిలో ప్రత్యేకంగా కనిపించాలి అని ప్రతి అమ్మాయి ఆరాటపడుతుంది. అయితే అతివ అందంలో మొదటి పాత్ర పోషించేది నల్లగా నిగనిగలాడే ఒత్తైన కురులు. మరి అంతటి ప్రాముఖ్యత ఉన్న కురులకు సరైనా జాగ్రత్తలు తీసుకోకుంటే జుట్టు కొనలు చిట్లి గడ్డిలా పిడచగట్టుకుని నిర్జీవంగా తయారవుతుంది. అదేవిధంగా వారంలో రెండు నుండి మూడు సార్లు తల స్నానం చేయడం వలన జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. లేదంటే తలలో మురికి పేరుకుపోయి జిడ్డుగా మారి చుండ్రు ఏర్పడి వెంట్రుకలు రాలిపోయే అవకాశం ఉంది. మరి మీ జుట్టును ఎలాంటి సమస్యలు దరిచేరకుండా ఆరోగ్యంగా ఒత్తుగా ఎదగాలంటే ఈ క్రింది చిట్కాలను ప్రయత్నించండి. మరి అవేంటో చుసేద్దామా..
* తలస్నానం చేసే సమయం లేకపోతే ఒక టేబుల్ స్పూన్ టాల్కమ్ పౌడర్ లేదా మొక్కజొన్న పిండిని తీసుకొని జుట్టుకు పట్టించి దువ్వేసుకున్న తల స్నానం చేసినట్టు కనిపిస్తుంది.
* అరటి పండ్లు, తేనె, పెరుగు,తక్కువ కొవ్వు ఉన్న పాలు కలిపి తయారుచేసిన డ్రింక్ నో కొన్ని వారాల పాటు తాగితే జుట్టు ఊడటం తగ్గుతుంది.
* తలస్నానం చేసిన తరువాత చివర్లో రెండు టేబుల్ స్పూన్ల మాల్ట్ వెనిగర్ ను రాస్తే జుట్టు మెరుస్తుంది.
* నిమ్మకాయ గింజలు, కొద్దిగా మిరియాలు కలిపి ముద్దగా నూరుకోవాలి. ఆ మిశ్రమాన్ని తలకి పట్టించి ఆరిన తరువాత స్నానం చేయాలి. ఇలా చేస్తే జుట్టు రాలడం తగ్గుతుంది.
* కొంచెం నిమ్మరసం తీసుకొని, దానిలో గుడ్డులోని తెల్లసొనను కలిపి మీ జుట్టుకు పూర్తిగా పట్టించాలి. ఒక అరగంట తర్వాత షాంపూతో తలస్నానం చేస్తే మీ జుట్టు బాగా పెరగడం ఏ కాకుండా ఎంతో మృదువుగా మారుతుంది.





Untitled Document
Advertisements