మీ ముఖచర్మం వదులుగా అవుతుందా అయితే ఇలా చేయండి..

     Written by : smtv Desk | Mon, May 23, 2022, 05:05 PM

మీ ముఖచర్మం వదులుగా అవుతుందా అయితే ఇలా చేయండి..

ప్రస్తుతం వాతావరణ కాలుష్యం, మారిన ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ తగ్గిపోవడం వీటి వలన ఎన్నో అనారోగ్యాల భారిన పడుతున్నాము. ఎన్నో రకాల జబ్బులు మనల్ని చుట్టుముట్టి వేధిస్తున్నాయి. ఈ అనారోగ్యాలతో పాటు మన చర్మం సైతం నిర్జీవంగా మారి కాంతిహీనంగా కనిపిస్తుంది. నిజానికి ముట్టుకుంటే జారిపోయే కోమలమైన మెరిసే చర్మం కావాలని ప్రతి ఆడపిల్ల కోరుకుంటుంది. మరి అలాంటి చర్మం కావాలి అంటే ఈ చిట్కాలను ట్రై చేస్తే మంచి రిజల్ట్ ఉంటుంది. మరి ఆ చిట్కాలేంటో చుసేద్దామా..
ఒక టీస్పూన్ తేనె,గుడ్డులోని తెల్లసొన, గ్లిజరిన్ రెండు స్పూన్ల చొప్పున కలిపి చివరిగా దానికి శెనగపిండి చేర్చి బాగా కలపాలి. దీన్ని ముఖానికి ప్యాక్ వేసుకొని పదిహేను నిమిషాల తరువాత తొలగించి శుభ్రం చేసుకోవాలి.
అలాగే గుడ్డులోని తెల్లసొనను ముఖానికి పట్టించండి. ఆరాక గోరువెచ్చని నీటితో కడిగేస్తే వదులైన చర్మం గట్టి పడి, మృదువుగా మారుతుంది.
అర కప్పు పుల్లటి పెరుగు చర్మానికి రాసుకుని మర్దన చేయండి. ఇరవై నిమిషాల తర్వాత వేడి నీటితో కడిగేయాలి. ఇలా చేస్తే ముఖం కోల్పోయిన తేమని పొందుతుంది. మృదుత్వా నికి ఇది చక్కగా పనిచేస్తుంది.
తేనె రాసుకున్నా మంచి ఫలితం కనిపిస్తుంది. తేనె చర్మానికి సహజ మాయిశ్చరైజర్లా పనిచేస్తుంది.
అర కప్పు ద్రాక్ష పళ్ళ గుజ్జుకు, మూడు టీ స్పూన్ల నిమ్మరసం, ఒక టీస్పూన్ ఆపిల్ గుజ్జు, పావు కప్పు గుడ్డులోని తెల్లసొనను కలపాలి. దీన్ని ముఖానికి రాసుకుని పదిహేను నిమిషాలయ్యాక గోరువెచ్చని నీటితో కడిగేయాలి.
ఈ ప్యాక్ జిడ్డు చర్మ తత్వానికి చక్కగా పనిచేస్తుంది. అలాగే గింజలు లేని టమాటా గుజ్జుని పావుకప్పు, కీరదోస గుజ్జు ఒక టీ స్పూన్, ఓట్ మీల్ పొడిని నాలుగు టీస్పూన్లు, పుదీనా మిశ్రమం ఒక టీస్పూన్ తీసుకొని బాగా కలిపి ప్యాక్ వేసిన ఫలితం ఉంటుంది. ఇలా చేస్తే చర్మంపై ఉండే జిడ్డు తొలగిపోయి కాంతివంతం అవుతుంది.





Untitled Document
Advertisements