చైనా పై బైడెన్ సంచలన వ్యాఖ్యలు..

     Written by : smtv Desk | Mon, May 23, 2022, 05:31 PM

చైనా పై బైడెన్  సంచలన వ్యాఖ్యలు..

అమెరికా అధ్యక్షుడు జో బైడన్ డ్రాగన్ దేశం చైనా పై సంచలన వ్యాఖ్యలు చేశారు. వాడు కూటమిలో భాగంగా భారత్ జపాన్ ఆస్ట్రేలియా పర్యటనలో బైడన్ ఉన్నారు. అయితే బైడన్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇది ఆయనకు తొలి ఆసియా పర్యటన పర్యటన కావడం విశేషం. అయితే తాజాగా జపాన్ లో పర్యటించిన ఆయన డ్రాగన్ దేశం చైనా పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ చైనా గనుక తైవాన్ దేశం పై దాడి చేస్తే తాము ఎలా రియాక్ట్ అవుతారో అని ఒక జర్నలిస్టు అడిగిన ప్రశ్నకి అమెరికా అధ్యక్షుడు జో బైడన్ సమాధానం ఇచ్చారు. చైనాపై అమెరికా వైఖరి ఎప్పటికీ అలాగే ఉంటుందని.. కానీ అటువంటి సంఘటన జరగకూడదని కోరుకుంటున్నామని పేర్కొన్నారు. ఒకవేళ తైవాన్ ను తమ దేశంలోకి ఆక్రమించే ప్రయత్నం చేసినట్లయితే తైవాన్ కు మద్దతుగా నిలబడే ఈ విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పకనే చెప్పుకొచ్చారు. అయితే పిండ పసిఫిక్ ఎకానమిక్ ఫ్రేమ్వర్క్ లో ఆసియాలో అమెరికా పెట్టుబడులు ఆర్థిక సాయం గురించి పెద్ద ప్రణాళికను ఏర్పాటు చేసుకున్నట్లు అర్థమవుతుంది.





Untitled Document
Advertisements