అనంత బాబు మాజీ డ్రైవర్ హత్యపై స్పందించిన మంత్రి బొత్స సత్యనారాయణ

     Written by : smtv Desk | Mon, May 23, 2022, 05:45 PM

అనంత బాబు మాజీ డ్రైవర్ హత్యపై స్పందించిన మంత్రి బొత్స సత్యనారాయణ

ఆంధ్రప్రదేశ్ మంత్రి బొత్స సత్యనారాయణ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్యను ప్రశంసిస్తూ ఆయనను రాజ్యసభకు పంపడంలో తప్పు వైసీపీని తప్పుపడుతున్న ప్రతిపక్షాలపై మండిపడ్డారు . ఆర్.కృష్ణయ్య ను రాజ్యసభకు పంపడంలో తప్పు ఏముందని ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు. ఆర్. కృష్ణయ్య బిసి సామాజిక వర్గానికి సంబంధించి సమస్యలపై నిరంతరం కృషి చేస్తూ ఎన్నో పోరాటాలు చేస్తున్నారన్నారు. అయితే ఆయన విషయంలో ఏ ప్రాంతం వాడు అని చూడకుండా ఎంత గొప్పగా ప్రజాసమస్యలపై స్పందించగలరు అనేది గుర్తుంచుకోవాలని ప్రతిపక్ష నాయకులకు హితవు పలికారు. అయితే బొత్స సత్యనారాయణ ఎమ్మెల్సీ అనంత బాబు డ్రైవర్ హత్య విషయంలో స్పందిస్తూ ఈ కేసుకు సంబంధించిన విషయాలన్నీ న్యాయస్థానం చట్టం చూసుకుంటుందని దీనిపై ప్రభుత్వం ఎలాంటి జోక్యం చేసుకోదని స్పష్టం చేశారు. చట్టం ముందు అందరూ సమానులే అని ఆయన వ్యాఖ్యానించారు . కానీ ఎమ్మెల్సీ అనంత బాబు డ్రైవర్ హత్య విషయంలో ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు విమర్శిస్తూనే ఉన్నాయి . కావున ఈ అంశంపై బొత్స సత్యనారాయణ మాట్లాడిన వ్యాఖ్యలను చూస్తే అనంత బాబు ని పార్టీ నుంచి సస్పెండ్ చేసే అవకాశం ఉందని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు.





Untitled Document
Advertisements