యుక్తవయసులో వేధించే మొటిమలకు చెక్ పెట్టండిలా

     Written by : smtv Desk | Mon, May 23, 2022, 06:03 PM

యుక్తవయసులో వేధించే మొటిమలకు చెక్ పెట్టండిలా

యుక్తవయసులో వేధించే సమస్యలలో మొటిమలు ఒకటి, మొఖం పై మొటిమలు రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. దుమ్ము, ధూళి, వాతావరణ కాలుష్యం. ఎక్కువగా ప్రాసెస్ చేసిన ఫుడ్ తినడం. జంక్ ఫుడ్ ఆయిల్ ఫుడ్ బయట స్ట్రీట్ ఫుడ్ మొదలైనవి ఎక్కువగా తినడం. అదేవిధంగా హార్మోన్స్ ప్రాబ్లెం వంటి వాటి వలన మొటిమలు వేదిస్తుంటాయి. అయితే ఈ సమస్యకు ఇంట్లో దొరికే వస్తువులతోనే పరిష్కార మార్గాలు ఉన్నాయి.
చెంచా వెనిగర్ లో మూడు చెంచాల నీళ్లు కలపాలి. దూది ఉండను అందులో ముంచి ముఖానికి రాసి పది నిమిషాల తర్వాత నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. దాల్చిని చెక్క లో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు మొటిమలకు కారణమైన బ్యాక్టీరియాను చంపేస్తాయి. రెండు చెంచాల తేనె, చెంచాడు దాల్చిన చెక్క పొడి కలపాలి. దీన్ని ముఖానికి పూతలా వేసి పావుగంట తరువాత గోరువెచ్చని నీళ్లతో కడిగేయాలి. సమపాళ్ళలో పాలతో తేనే పాలు కలిపి ముఖానికి పట్టించి పావుగంట తర్వాత కడిగేస్తే మంచి ఫలితం ఉంటుంది.
బొప్పాయి జిడ్డును తొలగించి మొటిమలు రాకుండా అడ్డుకుంటుంది దీనికోసం బాగా పండిన బొప్పాయి గుజ్జును ముఖానికి రాసి ఇరవై నిమిషాల తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగేయాలి. రెండు చెంచాల నారింజ తొక్కల పొడికి తగినన్ని నీళ్లు చేర్చి పేస్ట్ లా చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి ఇరవై నిమిషాల తర్వాత కడిగేయాలి.
అరటి పండు తొక్క నీ ముఖం పై వలయాకారంగా 15 నిమిషాల పాటు రుద్దాలి అరగంట తర్వాత నీళ్లతో శుభ్రం చేస్తే సరి. పచ్చి బంగాళదుంప ముక్కలు గా కోసి ఆ ముక్కలతో ముఖంపై వలయాకారంగా పది నిమిషాలపాటు రుద్దాలి. ఆరాక వెచ్చని నీళ్లతో కడిగితే మొటిమలు తగ్గుముఖం పడతాయి.






Untitled Document
Advertisements