వాట్సాప్‌లో హాయ్ అని చెప్తే చాలు మీరు కోరిన డాక్యుమెంట్లు మీ ఫోన్ కే..

     Written by : smtv Desk | Tue, May 24, 2022, 07:08 AM

వాట్సాప్‌లో హాయ్ అని చెప్తే చాలు మీరు కోరిన డాక్యుమెంట్లు మీ ఫోన్ కే..

ప్రస్తుత కాలంలో దాదాపు ప్రతి ఒక్కరి చేతిలోనూ తక్కువదో ఎక్కువదో స్మార్ట్ ఫోన్ ఉండడం కామన్ అయిపొయింది. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు దాదాపు ప్రతి నిమిషా నిమిషానికి ఓ సారి వాట్సాప్ చెక్ చేయడం ప్రతిఒక్కరికి అలవాటు. అయితే వాట్సాప్ వాడుతోన్న యూజర్లకు ఒక శుభవార్త అందించింది కేంద్ర ప్రభుత్వం. ఇక నుంచి వాట్సాప్ ద్వారా కూడా డిజిలాకర్ సేవలను యాక్సస్ చేసుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం సోమవారం తెలిపింది. వాట్సాప్ ద్వారా MyGov helpdeskపై డిజిలాకర్ సేవలను ప్రజలు వాడుకోవచ్చని మైగవ్ తెలిపింది. ప్రభుత్వ సేవలను తేలికగా ప్రజలు పొందేందుకు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్టు మైగవ్ చెప్పింది.
ఈ విషయంపై ప్రెస్ ఇన్‌ఫర్మేషన్ బ్యూరో(పీఐబీ) ట్వీట్ చేసింది. పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, వెహికిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ వంటి డిజిలాకర్ పేపర్లను ప్రజలు వాట్సాప్ ద్వారా యాక్సస్ చేసుకోవచ్చని తెలిపింది. దీనికోసం వాట్సాప్ యూజర్లు డిజిలాకర్ చాట్‌బోట్ వాట్సాప్ నెంబర్ +91 9013151515 నెంబర్‌కి నమస్తే లేదా హాయ్ చెప్తే చాలని తెలిపింది. లేదంటే డిజిలాకర్ అని మెసేజ్ పంపినా కూడా ఈ సేవలు అందుబాటులో ఉంటాయని పేర్కొంది.
డిజిలాకర్ అనేది డిజిటల్ ఇండియా ప్రొగ్రామ్‌లో భాగంగా కేంద్ర సర్కార్ ప్రవేశపెట్టిన ప్రధాన కార్యక్రమం. ఈ డిజిటల్ డాక్యుమెంట్ వాలెట్ ద్వారా అథెంటికేట్ డాక్యుమెంట్ల యాక్సస్‌ను ప్రజలకు కల్పిస్తుంది. ఒరిజినల్ ఫిజికల్ డాక్యుమెంట్ల మాదిరిగానే డిజిలాకర్ సిస్టమ్‌లోని డాక్యుమెంట్లు చెల్లుబాటు అవుతాయి. ఈ డాక్యుమెంట్లు డిజిలాకర్‌లో పూర్తిగా సురక్షితంగా ఉంటాయి. మీరు వాట్సాప్‌లో పొందగలిగే డాక్యుమెంట్లు లిస్ట్ ఇదే..
పాన్ కార్డు
డ్రైవింగ్ లైసెన్స్
సీబీఎస్ఈ క్లాస్ 10 పాస్ సర్టిఫికేట్
వెహికిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్
ఇన్సూరెన్స్ పాలసీ-టూవీలర్
క్లాస్ 10 మార్క్ షీటు
క్లాస్ 12 మార్క్ షీటు
ఇన్సూరెన్స్ పాలసీ డాక్యుమెంట్





Untitled Document
Advertisements