దావోస్లో లైఫ్ సైన్సెస్ రంగంపై చర్చించిన మంత్రి కేటీఆర్

     Written by : smtv Desk | Tue, May 24, 2022, 08:07 AM

దావోస్లో లైఫ్ సైన్సెస్ రంగంపై చర్చించిన మంత్రి కేటీఆర్

తెలంగాణా ఐటీశాఖ మంత్రి కేటీఆర్ దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న కేటీఆర్ తెలంగాణ ప్రభుత్వంలో జరిగిన లైఫ్ సైన్సెస్ రంగంపై చర్చించారు. లైఫ్ సైన్సెస్ రంగంపై చర్చించిన ఆయన రండి..పెట్టుబడులు పెట్టండి అని ప్రపంచ స్థాయి పారిశ్రామిక దిగ్గజాలకు పిలుపునిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి కారణంగా సంక్షోభం ఏర్పడిన నేపథ్యంలో లైఫ్ సైన్సెస్ మెడికల్ రంగానికి ప్రాధాన్యత మరింతగా పెరిగిందని కేటీఆర్ అన్నారు. లైఫ్ సైన్సెస్ మెడికల్ రంగానికి ఊతం ఇచ్చేందుకు అవసరమైన ప్రభుత్వ విధానాలకు భారతదేశంలో కొంత తక్కువ మద్దతు ఉందన్నారు.
ప్రపంచ స్థాయి పోటీలో తట్టుకుని నిలబడాలంటే భారత లైఫ్ సైన్సెస్ బలోపేతానికి విప్లవాత్మకమైన సంస్కరణలకు అవసరమన్నా రు. ఇప్పటికే హైదరాబాద్ లైఫ్సైన్స్ రంగంలో తన బలాన్ని మరింతగా పెంచుకుంటుందన్నారు. తెలంగాణ సర్కార్ లో జరిగిన లైఫ్ సైన్సెస్ రంగంపై చర్చించారు. లైఫ్సైన్సెస్ క్యాపిటల్గా హైదరాబాద్ ఉందని.. దీనిని మరింతగా బలోపేతం చేసేందుకు ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్ని హైదరాబాద్ ఫార్మా సిటీ పేరుతో ఏర్పాటు చేస్తున్నామని కేటీఆర్ తెలిపారు.
అయితే జాతీయ అంతర్జాతీయ ప్రాధాన్యత ఉన్న ఈ ప్రాజెక్టుకు కేంద్రం నుంచి సరైన మద్దతు లభించడం లేదని... భవిష్యత్తులో లైఫ్ సైన్సెస్ ఫార్మా రంగం మరింతగా విస్తరించాలంటే ఇన్నోవేషన్ విషయానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంద న్నారు. హైదరాబాద్ లైఫ్సైన్సెస్లో ఇతర నగరాలకంటే ముందుందని.. భవిష్యత్తులో నూతన మందుల ఆవిష్కరణ ప్రయోగ శాలను దాటి డిజిటల్ డ్రగ్ డిస్కవరీ వైపు లైఫ్సైన్సెస్ ముందుకు వెళ్తున్న నేపథ్యంలో ఐటీ ఫార్మా రంగం కలిసి పనిచేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
ప్రస్తుతం దేశంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన నోవర్టిస్ అతిపెద్ద రెండవ కార్యాలయం హైదరాబాద్లో ఉందని ఆయన చెప్పుకొచ్చారు. భారతదేశంలో పరిశోధన రంగాన్ని అభివృద్ధి చేసేందుకు విదేశాల నుంచి వచ్చే వారు పెట్టుబడులు పెట్టేందుకు సులభతరమైన విధానాలు ఉండాల న్నారు. కారణం లైఫ్ సైన్సెస్ రంగంలో ఇన్నోవేషన్ పై పెట్టే పెట్టుబడులు అత్యంత రిస్క్తో కూడుకున్నవి అవి ఎంత వరకు సక్సేస్ అవుతాయి.. అలాగే సక్సెస్ కావాడానికి ఎంత సమయం పట్టొచ్చు అనేది కచ్చితంగా చెప్పాడం కష్టం. కనుక ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం మరింత చొరవగా ముందుకు కదలాలని సూచించారు. ఆ దిశగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ వాణిజ్య శాఖ మంత్రి మరిన్ని చర్యలు తీసుకోవలసిన అవసరం ఉందని మంత్రి కేటీఆర్ అభిప్రాయ పడ్డారు.







Untitled Document
Advertisements