బొప్పాయిలోని ఆరోగ్య రహస్యాలు !

     Written by : smtv Desk | Tue, May 24, 2022, 08:17 AM

 బొప్పాయిలోని ఆరోగ్య రహస్యాలు !

బోపాయి పండుగానేనా తినేయవచ్చు లేదా జ్యూస్ చేసుకుని తాగవచ్చు అలాగే సలాడ్ లలోనే కలుపుకోవచ్చు బొప్పాయిని ప్రకృతి ఆహారాలలో దేనిలోనైనా కాంబినేషన్ గా తీసుకోవచ్చు. బొప్పాయి పండు మాత్రామే కాదు పచ్చి బొప్పాయిని కూడా తినదగినదే కూరలు, పచ్చడి రూపంలో పచ్చిబోప్పాయి తీసుకోవచ్చు. బొప్పాయి పండు, కాయ మాత్రమె కాదు ఆకుల యొక్క రసాన్ని కూడా డెంగ్యు జ్వరం వచ్చినప్పుడు రక్తంలో ప్లేట్ సెల్స్ పెరగడానికి తీసుకుంటూ ఉంటారు. మన పురాతన ఆయుర్వేద వైద్యంలో బొప్పాయిని ఔషధ గుణాలు కలిగిన చెట్టుగా పేర్కొనబడినది.
మరి ఇన్ని ఔషధ గుణాలున్న బొప్పాయి రెండు చెట్లు పెట్లు కుంటే ఇక ఇంటికి సరిపోయిన కాయలు పండ్లును ఇస్తుంది. బొప్పాయి ప్రకృతి అందించిన కానుక అది అన్ని సీజన్లలో దొరుకుతుంది. దాన్ని వీలైనప్పుడల్లా తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. బొప్పాయి తింటే కంటిచూపు మెరుగుపడుతుంది. జీర్ణశక్తి పెరుగుతుంది. త్వరగా వయసు మీద పడదు, చర్మం ముడతలు పడకుండా నివారిస్తుంది. శరీరాన్ని చురుకుగా ఉంచుతుంది. బొప్పాయి ఆకు రసం వారం రోజులు 50మి. లీ. నుండి 100మి. లీ. వరకూ త్రాగితే డెంగ్యూ వ్యాధి నివారణ జరిగి ప్లేట్లెట్లు పెరుగుతాయి. శరీరానికి కావాల్సిన సి,ఈ విటమిన్లు అందజేస్తుంది. ఫలితంగా శరీరానికి క్యాన్సర్ సోకదు. గాయాలు, కీళ్లనొప్పులు తగ్గుతాయి . రక్తాన్ని, చర్మాన్ని కండరాలను, జీర్ణకోశాన్ని, ఊపిరితిత్తులను, గుండెను క్షణాల్లో శుభ్రం చేస్తుంది. బొప్పాయిలోని పీచు పదార్థం వల్ల కొలెస్ట్రాల్ ను తొందరగా కరిగిస్తుంది.గుండె జబ్బులను రానివ్వదు. ఉదయమే తింటే చాలా మంచిది. బొప్పాయి బోలెడు రోగాలను అదుపుచేస్తుంది. ప్రకృతి ఆహారం తినే వ్యక్తులకు రోగాలు దరిచేరవు. బంధువులకు పెట్టే ఖర్చు ప్రకృతి ఆహారానికి పెట్టటం చాలా మంచి పద్ధతి.





Untitled Document
Advertisements