ఈ ఆకులు తింటే పంటి నొప్పి, నోటి దుర్వాసమ మాయం!

     Written by : smtv Desk | Tue, May 24, 2022, 09:06 AM

ఈ ఆకులు తింటే పంటి నొప్పి, నోటి దుర్వాసమ మాయం!

జామ చెట్లు కొందరి ఇండ్లలో కూడా పెంచుతారు కానీ దాని, యొక్క మందుల లక్షణాలు తెలియవు. జామ ఎన్నో రకాల వ్యాధులు నయం చేయటకు ఉపయోగపడుతుంది.మనం ఇంతకు పూర్వం జామకాయలు మాత్రమే తిన్నాము. జామా చాలా రుచిగా ఉంటుంది. ఎక్కువ పీచు పదార్థం ఉంటుంది. విరోచనము సులువుగా వస్తుంది. ఆరోగ్యాన్ని కాపాడుతుంది. జామ ఆకుల లో కూడా ఎన్నో మందు లక్షణాలు దాగి ఉన్నాయి. జామ ఆకులు కూడా ఎన్నో పోషకాలు ఉన్నాయి. ఆరోగ్య సమస్యలు రాకుండా చేసే యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. నొప్పులు, వాపులు నివారించే గుణం అధికంగా ఉంటుంది. నీటిని మరిగించి శుభ్రంగా కడిగిన జామ ఆకులను అందులో వేస్తే జామాకుల టీ తయారవుతుంది. దీనితో ఎన్నో రకాల ఫలితాలు పొందవచ్చు. ఈ టీ త్రాగటం వలన రక్తంలో గ్లూకోజ్ శాతం తగ్గుతుంది. దీనిలోని పోషకాలుకు బరువు తగ్గించే గుణం ఉంది. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ పెరిగిన వారికి, నెలకు ఒకసారి తగిన ఫలితం ఉంటుంది. అజీర్ణ సమస్యలు తగ్గుతాయి. జామాకు టీ తాగితే శ్వాస సంబంధ సమస్యలు తగ్గుతాయి. జలుబు, దగ్గును నివారిస్తుంధి. శుభ్రంగా కడిగిన జామ ఆకులు తింటే పంటి నొప్పులు దూరమవుతాయి. చిగుళ్ల నొప్పులు, పంటి పూత తగ్గుతుంది. జామాకు ఉదయమే నమలడం వలన నోటి దుర్వాసన పోతుంది.





Untitled Document
Advertisements