శ్రీలంక ప్రభుత్వాన్ని పట్టిన గతే కెసిఆర్ కి పడుతుంది : విజయశాంతి

     Written by : smtv Desk | Tue, May 24, 2022, 11:52 AM

శ్రీలంక ప్రభుత్వాన్ని పట్టిన గతే కెసిఆర్ కి పడుతుంది : విజయశాంతి

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రభుత్వంపై భారతీయ జనతా పార్టీ నాయకురాలు విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రం ఏర్పడ్డపుడు ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ ఏడు అప్పులపాలు అయ్యేలా చేశారని ధ్వజమెత్తారు. ఇదే సమయం అనుకుని విజయశాంతి తెలంగాణ ముఖ్యమంత్రి పై దాటిగా విమర్శలు చేశారు. తెలంగాణలో శ్రీలంక దేశం లాగే కుటుంబ పాలన నడుస్తోందని అక్కడ ప్రభుత్వం కూడా ఇలాగే అప్పులు చేసి దేశాన్ని ఆర్థిక మాంద్యం ఎదుర్కొనేలా చేసిందని మండిపడ్డారు. అయితే ప్రజలు చైతన్యవంతులై రాజపక్స కుటుంబానికి ఏ విధంగా ప్రజలు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారో.. తెలంగాణలో కూడా కల్వకుంట్ల కుటుంబానికి అదే ఈ విధంగా జరుగుతుంది అని జోస్యం చెప్పారు. కెసిఆర్ అధికారం నుండి దిగిపోయిన రోజు తెలంగాణకు మంచి రోజులు వస్తాయని ఆమె పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం అప్పుల కుప్పగా మారడం వల్ల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి మరో కొత్త అప్పు పుట్టేలా లేదని దీనికి కారణం చంద్రశేఖర రావు ప్రభుత్వమేనని విజయశాంతి స్పష్టం చేశారు.





Untitled Document
Advertisements