వరల్డ్ ఎకనామిక్ ఫోరం లోనూ రష్యా పై ఆంక్షలు విధించాలీ.. ఉక్రెయిన్ అధ్యక్షుడు

     Written by : smtv Desk | Tue, May 24, 2022, 12:41 PM

వరల్డ్ ఎకనామిక్ ఫోరం లోనూ రష్యా పై ఆంక్షలు విధించాలీ.. ఉక్రెయిన్ అధ్యక్షుడు

ఎకనామిక్ ఫోరం అంటే అందరికీ ఆర్థిక విషయాలు వ్యాపారాలు వంటి అంశాలే గుర్తుకొస్తాయి అటు వంటి అంశాలను ప్రస్తావిస్తారు. కానీ ఈ వ్యక్తి మాత్రం అనుకోకుండా ఆర్థిక సదస్సులో రాజకీయ పరమైనా అంశాలు మాట్లాడి అందరినీ ఆశ్చర్య పరిచేలా వ్యాఖ్యలు చేశారు. అతను ఎవరో కాదు ఉక్రెయిన్ దేశ అధ్యక్షుడు జలెన్స్కీ నే. స్విట్జర్లాండ్లోని దావోస్ నగరంలో జరుగుతున్న ప్రపంచ ఎకనామిక్ ఫోరం లో అన్ని దేశాలకు సంబంధించిన నాయకులు ఆర్థిక విషయాల గురించి వ్యాపారాలలో పెట్టుబడులు ఒప్పందాల గురించి మాట్లాడుతుంటే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కి అనుకోకుండా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రత్యక్షమై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశంలో జెలెన్స్కి మాట్లాడుతూ రష్యా దేశానికి సంబంధించిన వ్యాపార సంబంధాలను అన్ని దేశాలు తెంచేసుకోవాలని పిలుపునిచ్చారు. రష్యా దేశం వల్ల ప్రపంచంలో ఇటువంటి యుద్ధవాతావరణం నెలకొంది అన్ని దేశాలు ఐక్యమత్యంగా పోరాడాలని ఈ వ్యాఖ్యలు చేశారు. అంతేకాక ఈ ఆర్థిక సదస్సులో పాల్గొన్న ఉక్రెయిన్ ఎంపీలు అన్ని దేశాలు రష్యాపై ఆంక్షలను విధించాలని కోరడం అందరిలోనూ ఆశ్చర్యానికి తెరతీసింది. అయితే అన్ని దేశాలు ఆర్థిక వాణిజ్య వ్యాపారాలు దృష్ట్యా ఏర్పాటు చేసిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం లో రాజకీయపరమైన వ్యాఖ్యలు చేయడం పట్ల అందరూ విశ్చిత్తులై పోయారు.





Untitled Document
Advertisements