ఎయిర్ ఇండియా హౌసింగ్ కాలనిలను ఉద్యోగులు ఖాళీ చేయాలంటూ ప్రకటన

     Written by : smtv Desk | Tue, May 24, 2022, 01:13 PM

ఎయిర్ ఇండియా హౌసింగ్ కాలనిలను ఉద్యోగులు ఖాళీ చేయాలంటూ  ప్రకటన

కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేయడానికి నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే .. దీనిలో భాగంగానే ఎయిర్ ఇండియాను కూడా అమ్మకానికి పెట్టడం జరిగింది. అయితే ఎయిర్ ఇండియా సంస్థను టాటా సన్స్ కొనుగోలు చేయగా .. ఎయిర్ ఇండియాకు చెందిన ఆస్తులు అయిన హౌసింగ్ కాలనీలు ను అందులోని ఉద్యోగులు ఖాలీ చేయాలనీ ఇప్పటికి నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే ఈ కాలనీలను ఆరు నెలల్లోగా ఖాళీ చేయాలని గతేడాది అక్టోబరులో ఉత్తర్వులు జారీచేశారు. అయితే అప్పట్లో ఉద్యోగులు అందరు తాము ఇప్పటికిప్పుడే ఖాళి చేయలేం అంటూ పేర్కొనగా .. వారికి మరికొద్దిరోజులు సమయం కావాలని కోరగా .. కొంత వరకు గడువును ఇచ్చింది. అయితే గడువు తేదీ దగ్గరకు వస్తుండటంతో ఈ నెల ప్రభుత్వ కాలనీలను సిబ్బంది ఖాళీచేసే విషయాన్ని గుర్తుచేస్తూ మే 17న ఎయిరిండియా అసెట్సల్ హోల్డింగ్ నుంచి మెయిల్ వచ్చింది.. జులై 26 ను తుది గడువుగా పేర్కొంటూ ఉత్తర్వులు జారీచేసింది. అయితే, కొనుగోలు ఒప్పందం ప్రకారం హౌసింగ్ కాలనీలు వంటి నాన్-కోర్ ఆస్తులు ప్రభుత్వానికే చెందుతాయి. ఢిల్లీ, ముంబయిలో ఎయిరిండియాకు అతిపెద్ద కాలనీలు ఉండగా వాటిని కూడా ప్రైవేటు పరం చేయబోతున్నరనే సమాచారం . ఢిల్లీ, ముంబైలో అనుమతించబడిన కాలానికి మించి ఎయిర్‌లైన్స్ కాలనీల్లో ఉంటున్న ఏ 1 గ్రేడ్ ఉద్యోగులు వరుసగా రూ. 10, రూ .15 లక్షల జరిమానా చెల్లించాల్సి వస్తుందని ఎయిర్ ఇండియా సంస్థ పేర్కొనడం గమనార్హం .





Untitled Document
Advertisements