లంకలో 400 కి చేరిన పెట్రో ధరలు ..

     Written by : smtv Desk | Tue, May 24, 2022, 02:05 PM

లంకలో 400 కి చేరిన పెట్రో ధరలు ..

శ్రీలంక దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభంతో విలవిలలాడుతున్న విషయం తెలిసిందే .. శ్రీలంకలో ఈ ఆర్థిక సంక్షోభం వల్ల నిత్యావసర వస్తువులు ఆహార పదార్థాల కోరతా వాటి ధరలు అమాంతం పెరిగిపోయాయి . అంతేకాక లంక లో ఆర్థిక మాంద్యం వల్ల ఎలాంటి పరిస్థితులు నేలకోన్నాయో .. ప్రభుత్వ వ్యతీరేక పోరాటాలు ఎంతగా తీవ్ర స్థాయికి చేరాయో తెలిసిందే .. అయితే ఇప్పుడు శ్రీలంకకు నూతన ప్రధానిగా ఉన్న విక్రమ సింఘే నూతన విధానాల ద్వారా దేశ ఆర్థిక పరిస్థితిని మార్చగలరనే అందరు భావిస్తున్నారు. కాని ఈ సమయంలోనే శ్రీలంకలో పెట్రోల్ మరియు డీజిల్ ధరలు అమాంతం పెరిగిపోయాయి. లీటర్ పెట్రోల్ ధర ఏకంగా 24.3 శాతం పెంచుతూ మరియు డీజిల్ ధర 38.4 శాతం పెంచి సిలోన్‌ పెట్రోలియం కార్పొరేషన్ పెట్రోల్ మరియు డీజిల్ ధరలను ప్రకటించింది. అయితే పెట్రోల్ మరియు డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి. లీటర్
పెట్రోల్ ధ‌ర‌ రూ.82 పెరిగి, రూ.420కి చేరింది. అలాగే, లీట‌రు డీజిల్ ధ‌ర‌ రూ.111 పెరిగి, రూ.400కు చేరింది. ఇప్పటికైనా ధరలు తగ్గి ప్రజలకు ఆర్థిక భారం తగ్గుతుందనుకున్న సమయంలో ఈ మేర పెట్రో ధరలను పెంచడం వల్ల శ్రీలంక ప్రజానీకం మరింత కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ఇటు ఇండియన్‌ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) అనుబంధ సంస్థ లంకా ఐఓసీ కూడా చమురు ధరలను పెంచింది. ర‌వాణా ఛార్జీల‌పై భారం మ‌రింత ప‌డుతుండ‌డంతో దేశంలోణి ప్రజలపై మరింత ఆర్థిక భారం పడనున్నట్లుగా అర్థం అవుతుంది.





Untitled Document
Advertisements