పంజాబ్ రాష్ట్ర మంత్రిని డిస్మిస్ చేసిన సీఎం భగవంత్ మాన్

     Written by : smtv Desk | Tue, May 24, 2022, 02:45 PM

పంజాబ్ రాష్ట్ర మంత్రిని డిస్మిస్ చేసిన సీఎం భగవంత్  మాన్

అవీనితి రహిత పాలనే లక్ష్యంగా అవిర్భంచిన పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ . తమ పాలనలో అవినీతిని పూర్తిగా అణచివేయ్యలని ముందుగా ఢిల్లీ లో అధికారం చేపట్టినప్పటి నుండి అవినీతి అంతానికి కంకణం కట్టుకుని మరి పని చేస్తుంది . అయితే ఇటివలే పంజాబ్ లో అధికారం లోకి వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ అవినీతి చోటు లేదని ఎవరైనా పట్టుబడితే తీవ్ర చర్యలు తీసుకుంటామని ఎప్పుడో పేర్కొంది కూడా .. పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కూడా ఈ విషయాన్ని పదేపదే ప్రస్తావిస్తూ వచ్చారు. అవినీతిని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని చెప్పినట్టుగానే ఒక అవినీతిపై తీవ్ర చర్యలు తీసుకున్నారు భగవంత్ మాన్ . పంజాబ్
రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి విజయ్ సంగ్లా ప్రభుత్వ కాంట్రాక్టులకు సంబంధించి ఒక శాతం కమిషన్ తీసుకుంటూ సరైన ఆధారాలతో పట్టుబడ్డాడు. కావున ఆయనను పదవి నుండి డిస్మిస్ చేస్తూ భగవంత్ మాన్ నిర్ణయం తీసుకున్నారు. పదేపదే చెప్పిన కూడా మంత్రి ఇలా వ్యవహరించడం పట్ల తీవ్ర ఆగ్రహం తో ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఈ నిర్ణయం తీసుకున్నారు . అవినీతి నిరోధకంగా జనాల్లోకి వచ్చిన పార్టీ కాబట్టే ప్రజలలో ఆప్ ఎంతో ఆదరణను పెంపొందించుకుంది. అలంటి పార్టీ లో ఇలాంటి నాయకుల వల్ల ప్రజలకు పార్టీ పై నమ్మకం పోతుంది .






Untitled Document
Advertisements