భారత్ అమెరికాల మద్య సంబంధాన్ని వివరించిన మోడీ

     Written by : smtv Desk | Tue, May 24, 2022, 04:51 PM

భారత్ అమెరికాల మద్య సంబంధాన్ని వివరించిన మోడీ

జపాన్ లో జరుగుతున్న క్వాడ్ సమవేశంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తైవాన్ దేశం విషయంలో చైనా పై సంచనలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.. అయితే ఈ సమావేశంలో భారత దేశ ప్రధాన మంత్రి కూడా పాల్గొనడం జరిగింది. ఈ సమావేశంలో నరేంద్ర మోడీ అమెరికా అధ్య‌క్షుడు జో బైడెన్, జ‌పాన్ ప్ర‌ధాని కిషిదా, ఆస్ట్రేలియా ప్ర‌ధాని అల్బ‌నీస్ సమావేశం అయ్యారు. అంతర్జాతీయ అంశం అయిన ఇండో - పసిఫిక్ అంశాలపై మాట్లాడుతూ .. ఈ నాలుగు దేశాల కలయిక మరో నూతన శక్తిగా మారబోతుందని స్పష్టం చేసారు. కరోనా సంక్షోభంలో అన్ని దేశాలు కలిసికట్టుగా ఉన్నామని ఇక ముందు కూడా ఈ దౌత్య సంబంధాలను అలాగే కొనసాగిన్చుకుంటామని స్పష్టం చేసారు. అయితే సమావేశంలో ముఖ్యంగా ఇండో - పసిఫిక్ ప్రాంతాలలో పరిస్థితులు తీసుకోవాల్సిన చర్యలు దేశాల మద్య సంబంధాలు తదితర అంశాల పై చర్చలు జరుపుతున్నారు. ఈ క్వాడ్ సమావేశంలో అన్ని దేశాల నేతలు స్వేచ్ఛా సంబదాలతో ఇండో మరియు పసిఫిక్ దేశాల మద్య ఒక నిర్ణిత ఎజెండాతో ముందుకెల్తున్నామని వారు స్పష్టం చేసారు . ఈ క్వాడ్ సమావేశంలో పాల్గొన్న దేశాలు దేశాల మద్య సంబంధాలను మరింత విస్తృతంగా పెంచుకొని ఒక నవ శక్తిగా ఏర్పడబోతున్నామని వెల్లడించడం జరిగింది. అంతేకాక అనంతరం అమెరికా అధ్యక్షుడు జో బైడేన్ తో రెండు దేశాల మద్య దౌత్య సంబంధాల దృష్ట్యా సమావేశం అయ్యారు. అయితే ఇరు దేశాలకు ఎన్నో అంశాల్లో పోలికలు, సామీప్యతలు ఉన్నాయి. రెండు దేశాలలో పాలన విధానం అద్భుతంగా కొనసాగుతుందని ఇరు దేశాల మద్య వ్యాపార, పెట్టుబడుల సంబంధాలు చాలా మెరుగుపడ్డాయని పేర్కొన్నారు.





Untitled Document
Advertisements