తాలిబాన్ల నిర్ణయానికి నిరసనగా మాస్కులతో న్యూస్ చదువుతున్న పురుష న్యూస్ రీడర్లు..

     Written by : smtv Desk | Tue, May 24, 2022, 06:13 PM

తాలిబాన్ల నిర్ణయానికి నిరసనగా మాస్కులతో న్యూస్ చదువుతున్న పురుష న్యూస్ రీడర్లు..

ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్లు అధికారం చేజిక్కించుకున్న నాడు.. తరువాత గతంలో లాగా కాకుండా ప్రజాశ్రేయస్సు పైనే దృష్టి పెడతాం అంటూ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. మహిళల పై అనేక నిషేధాలను ఆంక్షలను విధిస్తూ వారిని సమాజానికి సంబందం లేని వారిగా చేయాలనే కంకనం కట్టుకున్నట్టున్నారు. అయితే మహిళలకు ప్రాథమిక విద్యకే పరిమితం చేస్తూ ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే . అంతేకాక మహిళలను సంఘంలోకి రావాలంటే తప్పకుండా బూర్ఖ ధరించాలని పేర్కొన్నారు.లేకపోతే కఠినమైన చర్యలు ఉంటాయని కూడా చెప్పారు. అదే విధంగా మహిళలలు పురుషులు తోడుగా లేకుండా ప్రయాణాలు చేయద్దనే నిబంధనను కూడా తీసుకొచ్చింది . వీటి వల్ల ఆఫ్గాన్ లోని మహిళలు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కుంటున్నారు. అంతేకాక ఈసారి ఏకంగా ఉద్యోగంలో ఉన్న మహిళలపై పడ్డారు. న్యూస్ రీడర్లుగా పని చేసే మహిళలు తప్పకుండా భూర్ఖా ధరించాలనే నిభందనను తీసుకొచ్చారు. న్యూస్ యాంకర్లు మరియు ప్రజెంటేటర్లు వార్తలు చదువుతున్న సమయంలో తమ ముఖాలను కనిపించకుండా ఉంచాలని టెలివిజన్ చాన్నేల్లకు ఆదేశాలు జారీ చేసారు. అయితే మహిళా న్యూస్ రీడర్లు మాస్కులతో న్యూస్ చదువుతుండగా వారికి మద్దతుగా పురుష న్యూస్ రీడర్లు కూడా నిరసనగా మాస్క్ లతో వార్తలు చదువుతున్నారు. అయితే ఈ నిర్ణయం కేవలం తాలిబాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగానే అని వారు పునరుద్ఘాటించారు.





Untitled Document
Advertisements