కోనసీమలో అల్లర్లను టీడీపి కారణమన్న హోంమంత్రి ఆరోపణలను ఖండిస్తున్నా.. చంద్రబాబు

     Written by : smtv Desk | Wed, May 25, 2022, 08:32 AM

కోనసీమలో అల్లర్లను టీడీపి కారణమన్న హోంమంత్రి ఆరోపణలను  ఖండిస్తున్నా.. చంద్రబాబు

ఏపీలోని కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టడం అక్కడి ప్రజలు ఏమాత్రం అంగీకరించ లేకపొతున్నారు. దీంతో కోనసీమ జీల్లాలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. నిరసనకారులు అమలాపురంలో తీవ్ర విధ్వంసానికి పాల్పడ్డారు. మంత్రి పినిపే విశ్వరూప్, ఎమ్మెల్యే సతీష్ బాబుల ఇళ్లకు నిప్పటించారు. అయితే ఈ అల్లర్లపైన స్పందించిన ఏపీ హోంమంత్రి తానేటి వనిత వెనుక టీడీపీ, జనసేన పార్టీలు ఉన్నాయని తీవ్ర ఆరోపణలు చేశారు.
హోంమంత్రి తానేటి వనిత ఆరోపణలపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు స్పందించారు. కోనసీమలో ప్రభుత్వ వైఫల్యాన్ని టీడీపీపై నెట్టడాన్ని ఖండిస్తున్నట్టు తెలిపారు. సున్నితమైన అంశంలో హోంమంత్రి నిరాధార ఆరోపణలు చేయడం తగదని హితవు పలికారు. ప్రశాంతంగా ఉండే కోనసీమలో ఘర్షణలు దురదృష్టకరమని అన్నారు. ఇలాంటి పరిస్థితులు ఏర్పడడానికి పోలీసులు, ప్రభుత్వ వైఫల్యమేనని చంద్రబాబు స్పష్టం చేశారు. కోనసీమ ప్రజలు సంయమనం పాటించాలని సూచించారు. కోనసీమలో ప్రశాంతత నెలకొనేలా ప్రజలంతా సహకరించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.





Untitled Document
Advertisements