కోనసీమలో అల్లర్ల వెనకాల వారే ఉన్నారు..హోం మంత్రి తానేటి వనిత

     Written by : smtv Desk | Wed, May 25, 2022, 10:52 AM

కోనసీమలో అల్లర్ల వెనకాల వారే ఉన్నారు..హోం మంత్రి తానేటి వనిత

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతన జిల్లాల ఏర్పాటు మరియు జిల్లాల పేర్లు మార్చిన విషయం తెలిసిందే. కోనసీమ జిల్లా పేరును డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మార్చడాన్ని వ్యతిరేకిస్తూ పలువురు ఆందోళనలు చేపడుతున్నారు . అయితే కొందరు వీరికి వ్యతిరేఖంగా మార్చిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా పేరునే ఉంచాలని మరికొందరు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇలా జిల్లా పేరును మార్చడం వల్ల ఆందోళనకారులు మంత్రి విశ్వరూప్ మరియు ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ నివాసాలకు నిప్పు అంటించడం జరిగింది . దీని ద్వారా జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి అయితే వారం రోజుల పాటు జిల్లాలో 144 అమలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ అంశంపై ఆంధ్రప్రదేశ్ హోం శాఖ మంత్రి తానేటి వనిత సీరియస్ అయ్యారు. కోనసీమ జిల్లాకు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పేరు పెట్టడంలో తప్పేమీ లేదన్నారు. అయితే దీనిని వ్యతిరేకించే వారి వెనకాల తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీలు ఉన్నాయని ఆమె మండిపడ్డారు. అయితే ఈ అల్లర్లకు కారణమైన వారు ఎవరో తెలిసిన వెంటనే వారిపై కఠిన శిక్షలు అమలు చేస్తామని మంత్రి వెల్లడించారు .





Untitled Document
Advertisements