కోనసీమలో ఉద్రిక్త పరిస్థితులు ఇంటర్నెట్ సేవల బంద్ కు కలెక్టర్ ఆదేశం..

     Written by : smtv Desk | Wed, May 25, 2022, 12:55 PM

కోనసీమలో ఉద్రిక్త పరిస్థితులు ఇంటర్నెట్ సేవల బంద్ కు కలెక్టర్ ఆదేశం..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతన జిల్లాల ఏర్పాటు మరియు జిల్లాల పేర్లు మార్చడం వల్ల కోనసీమ జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కోనసీమ జిల్లా పేరును డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మార్చడాన్ని వ్యతిరేకిస్తూ పలువురు ఆందోళనలు చేపడుతున్నారు . అయితే కొందరు వీరికి వ్యతిరేఖంగా మార్చిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా పేరునే ఉంచాలని మరికొందరు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇలా జిల్లా పేరును మార్చడం వల్ల ఆందోళనకారులు మంత్రి విశ్వరూప్ మరియు ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ నివాసాలకు నిప్పు అంటించడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో జిల్లా పేరును మార్చేది లేదని ప్రభుత్వం తేల్చి చెప్పేసింది . దీంతో కోనసీమలో పరిస్థితులను అదుపులోకి తీసుకు వచ్చేందుకు జిల్లా కలెక్టర్ జిల్లా వ్యాప్తంగా విధించడం జరిగిందిఅయితే ఈ కార్యక్రమంలో భాగంగా ఇంటర్నెట్ సేవలను బంద్ చేయడం మరియు అమలాపురం వంటి పట్టణాలలో అన్ని సినిమా ఆటలను రద్దు చేశారు. అయితే ఇంటర్నెట్ వల్ల వాట్స్అప్ వంటి సామాజిక మాధ్యమాలలో ఫేక్ న్యూస్ లు క్రియేట్ చేస్తూ శాంతి భద్రతలను దెబ్బతీసే ప్రయత్నం జరిగే అవకాశం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లాలో ఇంతకుముందే 144 సెక్షన్ అమలులో కూడా ఉంది.





Untitled Document
Advertisements