ఎస్పిలో చేరిన కపిల్ సిబాల్ .. కాంగ్రెస్ కు మరో దెబ్బ

     Written by : smtv Desk | Wed, May 25, 2022, 02:05 PM

ఎస్పిలో చేరిన కపిల్ సిబాల్ .. కాంగ్రెస్ కు మరో దెబ్బ

భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ పుంజుకోవడం అటుంచితే రోజురోజుకు డిలా పడిపోతుంది. ఇటివలే గుజరాత్ లో పటిదార్ రిజర్వేషన్ల ఉద్యమకర్త హార్దిక్ పటేల్ కాంగ్రెస్ పార్టీ కి రాజీనామా చేసి ఒక గట్టి షాక్ ఇచ్చారు. అయితే పార్టీని వీడినప్పటి నుండి ఆయన కాంగ్రెస్ పై రాహుల్ గాంధీ పై పార్టీ నేతలపై అనేక తీర్లుగా విమర్శిస్తూ కూడా వచ్చారు. అయితే దీని నుండి కాంగ్రెస్ పార్టీ కోలుకోక ముందే మరో గట్టి దెబ్బ తగిలింది . కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాఆజి కేంద్ర న్యాయశాఖ మంత్రి కపిల్ సిబాల్ కాంగ్రెస్ కు రాజీనామా చేసారు. అయితే ఆయన కాంగ్రెస్ పార్టీ కి మే 16 వ తారీఖుననె రాజీనామా చేసినట్లు పేర్కొనడం జరిగింది. అయితే ఆయన రాజీనామా చేసిన ఇన్నిరోజుల తరువాత ఈ విషయాన్నీ ప్రస్తావించారు. అంతేకాక రాజ్యసభ ఎన్నికలు జరగబోతున్న తరుణంలో ఉత్తరప్రదేశ్ నుండి సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థిగా పోటీచేస్తున్నట్టు కపిల్ సిబల్ ప్రకటించారు. అంతేకాక కాంగ్రెస్‌ అధిష్ఠానంపై పోయిన సంవత్సరం లేఖాస్త్రం సంధించిన జీ-23 రెబల్ నేతల్లో కపిల్ సిబల్ ఒకరు. ఇటివలే సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ తో సమావేశం అయ్యిన సంగతిని కూడా వెల్లడించారు. '' పార్లమెంటులో మన గొంతును వినిపించడం ముఖ్యం.. ఒక ప్రజగొంతుక మాట్లాడితే అది ఏ రాజకీయ పార్టీది కాదని ప్రజలు నమ్ముతారనె అంశాన్ని కపిల్ సిబాల్ వ్యాఖ్యానించారు.





Untitled Document
Advertisements