ఆ సమయంలో కె.ఎల్.రాహుల్ దూకుడుగా ఆడి నట్లయితే లక్నో తప్పకుండా గెలిచేది.. రవిశాస్రి

     Written by : smtv Desk | Thu, May 26, 2022, 12:54 PM

ఆ సమయంలో కె.ఎల్.రాహుల్ దూకుడుగా ఆడి నట్లయితే లక్నో తప్పకుండా గెలిచేది..  రవిశాస్రి

ఐపీఎల్ 2022 ఈ సీజన్లో భాగంగా బుధవారం ఎలిమినేటర్ మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మరియు లక్నో సూపర్ జాయింట్స్ జట్లు ఈడెన్ గార్డెన్స్ వేదికగా రజత్ పటిదార్ అద్భుత ఇన్నింగ్స్ తో లక్నో గేటు ముందర భారీ లక్ష్యాన్ని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఉంచగలిగింది. అయితే లక్ష్యఛేదనలో లక్నో జట్టు కెప్టెన్ కె.ఎల్.రాహుల్ మినహా ఎవరూ అంతగా రాణించలేదు. అయితే కె.ఎల్.రాహుల్ బ్యాటింగ్ పై ఇండియా మాజీ క్రికెట్ దిగ్గజం మాజీ కోచ్ రవిశాస్త్రి కొన్ని వ్యాఖ్యలు చేశాడు. చేజింగ్ లో లక్నో జట్టు 7 నుంచి 13 ఓవర్ల మధ్యలో కేవలం 49 పరుగులే చేయగలిగింది అయితే ఈ అంశంపై రవిశాస్త్రి మాట్లాడుతూ ఆ సమయంలో కె.ఎల్.రాహుల్ ఎవరైనా ఒక బౌలర్ ని టార్గెట్ చేసిన పరుగులు రాబట్టినట్లయితే బెంగళూరు పై ప్రెజర్ పెరిగి లక్నో జట్టుకు మరి ఇంత ఈజీ అయ్యేదని రవి శాస్త్రి చెప్పుకొచ్చాడు. కేఎల్ రాహుల్ కొంత ఓపిక తీసుకొని ఎవరైనా బౌలర్ ని టార్గెట్ చేసినట్లయితే లక్నో విజయాన్ని సొంతం చేసుకునేదని వెల్లడించారు.





Untitled Document
Advertisements