ఒక అమ్మాయిని ట్రై చేస్తే ఇంకో అమ్మాయి పడింది.. పెళ్లైంది.. అనిల్ రావిపూడి

     Written by : smtv Desk | Thu, May 26, 2022, 02:32 PM

ఒక అమ్మాయిని ట్రై  చేస్తే ఇంకో అమ్మాయి పడింది.. పెళ్లైంది.. అనిల్ రావిపూడి

తెలుగు సినీ పరిశ్రమలో ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి చేసిన కొన్ని వ్యాఖ్యలు ఈమధ్య వైరల్ గా మారాయి. ఎఫ్ టూ సినిమాల ద్వారా అందరినీ అలరించిన అనిల్ రావిపూడి ఈసారి ఏకంగా తన భార్య గురించి కొన్ని వ్యాఖ్యలు చేసి అందరినీ నవ్వించాడు. తాను కాలేజీలో చదివే సమయంలో కామెడీ ఒక పెద్ద బ్యాచ్ ఉండేదని ఆ బ్యాచ్ అంతా కలిసి ఒక నలుగురు అమ్మాయిల గ్యాంగ్ వెనుక తిరిగేవారు అని చెప్పుకొచ్చారు. అయితే ఆ గ్యాంగ్ లో తాను ఒక అమ్మాయిని ట్రై చేశాను అని.. అయితే ఆ గ్యాంగ్ లో తన భార్య కూడా ఒక వ్యక్తి అని వెల్లడించారు. అయితే తాను ట్రై చేసిన అమ్మాయి కాకుండా ఈమె భార్య అయింది అని చెప్పి అందరినీ నవ్వించాడు. అమ్మాయికి ట్రై చేసే మరో అమ్మాయి నా ప్రేమలో పడింది ఇలా నా కథ సాగింది అంటూ అందరినీ అనిల్ రావిపూడి నవ్వించాడు . అయితే అనిల్ రావిపూడి దర్శకత్వం లో ఎఫ్ 3 సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో అనిల్ రావిపూడి ఈ వ్యాఖ్యలు చేయడం పట్ల ఎఫ్ 3 సినిమా ప్రమోషన్ లో భాగంగా నేను ఇలాంటి వ్యాఖ్యలు చేశారు అని అందరూ అనుకుంటున్నారు. అయితే అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా రేపు విడుదల కానుంది.





Untitled Document
Advertisements