ఒకే వేదికపై ప్రధాని ముందు సంచలన వ్యాఖ్యలు చేసిన తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్..

     Written by : smtv Desk | Fri, May 27, 2022, 10:23 AM

ఒకే వేదికపై ప్రధాని ముందు సంచలన వ్యాఖ్యలు చేసిన తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్..

తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రధాని నరేంద్రమోడీ ఎదుటే సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. స్టాలిన్ ప్రజా శ్రేయస్సుకోసం ఎన్నో మంచి పథకాలు ప్రవేశపెట్టి ద్వారా ఇప్పటివరకు వార్తల్లోకి వచ్చారు. అయితే ఈసారి ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు వేదిక పంచుకున్న ఆయన కేంద్రం అమలు చేసిన కొన్ని విధానాల పై నిప్పులు చెరిగారు. ఈ వ్యాఖ్యల ద్వారా స్టాలిన్ మోడీ కి ఒక చేదు అనుభవాన్ని మిగిల్చినట్లే అని చెప్పాలి. హైదరాబాదులో ఇండియన్ బిజినెస్ స్కూల్లో 20 సంవత్సరాల వేడుకలను ఉద్దేశించి మాట్లాడిన మోడీ అనంతరం తమిళనాడు వెళ్లారు అక్కడ స్టాలిన్ తో కలిసి కొన్ని అభివృద్ధి పనులకు ప్రారంభం చేశారు. అయితే ఈ వేదికమీద స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు ప్రధాని నరేంద్ర మోదీ మరియు కేంద్ర ప్రభుత్వానికి గట్టి సవాలే అనుకోవాలి. వేదిక మీద తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ మాట్లాడుతూ.. తమిళనాడుప్రజలపై హిందీ నిరుద్ధ వద్దని తమిళ భాషను మాత్రమే అధికారభాషగా గుర్తించాలి అంటూ ప్రధాని ముందు డిమాండ్ పెట్టారు. అయితే వైద్య ప్రవేశపరీక్ష నీట్ నుండి తమిళనాడు రాష్ట్రానికి మినహాయింపు ఇవ్వాలని పేర్కొంటూ.. మేము దాన్ని వ్యతిరేకిస్తున్నానని అసెంబ్లీలో బిల్లు కూడా ప్రవేశ పెట్టాం అని వ్యాఖ్యలు చేశాడు. అంతేకాక మద్రాస్ హైకోర్టులో హిందీ ఏవిధంగా అధికార భాషగా కొనసాగుతుందో తమిళ భాషను కూడా అధికారభాషగా మార్చాలి అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు. అలాగే తమిళనాడు రాష్ట్రానికి కేంద్రం ద్వారా రావాల్సిన నిధులను వెంటనే విడుదల చేయాలని ప్రధానికి తెలియజేశారు. అయితే స్టాలిన్ ముక్కుసూటితనానికి అందరూ చప్పట్లు కొడుతున్నారు.





Untitled Document
Advertisements