వెలసిటి పై సూపర్ నోవాస్ విజయం ..

     Written by : smtv Desk | Fri, May 27, 2022, 11:07 AM

వెలసిటి పై సూపర్ నోవాస్ విజయం ..

పురుషుల ఇండియన్ ప్రీమియర్ లీగ్ లాగే మహిళా టీ 20 ఛాంపియన్స్ ఛాలెంజ్ లో భాగంగా ట్రయల్ బ్లేజర్స్
మరియు వెలాసిటీ జట్లు పూణేలోని ఎంసీఏ స్టేడియం వేదికగా తలపడ్డాయి. అయితే ఈ మ్యాచ్ లో ట్రయల్ బ్లేజర్స్ జట్టును లీడ్ చేస్తున్న స్మృతి మందన బృందం మొదటగా బ్యాట్టింగ్ చేయగా ఓపెనింగ్ బ్యాట్స్మెన్ మేఘన మరియు జెమీమా రోడ్రిగ్స్ లు ప్రత్యర్థి బౌలర్ల పై విరుచుకుపడ్డారు . మేఘన ఏకంగా 73 పరుగులతో రాణించగా రోడ్రిగ్స్ 66 పరుగులతో ప్రత్యర్థులకు చెమటలు పట్టించింది. వీరిద్దరి దెబ్బకు సుపెర్నోవాస్ జట్టు ఇరవై ఓవర్లు ముగిసే సమయానికి 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. వెలాసిటీ బౌలర్లలో సిమ్రన్ బహదూర్‌ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. రెండవ ఇన్నింగ్స్ ను ప్రారంభించిన వెలసిటి జట్టు 191 పరుగుల భారీ లక్ష్య చేధనలో ఏ బ్యాట్టేర్ కూడా క్రీజులో నిలవలేకపోయారు . వేలాసిటి బ్యాటర్లలో కిరణ్ నవ్‌గిరే 69 పరుగులతో ఒంటరి పోరాటం చేసిన కూడా వేరే బ్యాటర్లు ఎవరు సరిగా అడకపోగా వెలాసిటి జట్టుకు ఓటమి తప్పలేదు. వెలాసిటి బ్యాటర్లలో దూకుడు బ్యాట్స్మెన్ అయిన షెఫాలీ వర్మ 29 పరుగులకే పరిమితమవడం , మరో బ్యాట్స్మెన్ యస్తికా భాటియా 19 కూడా వెనుదిరగడం తో ఓటమి దిశగా మొదటినుండే వేలసిటి జట్టు నడిచింది . ఇంకా ఇతర బ్యాట్స్మెన్ లారా 17, స్నేహ్ రాణా 11, సిమ్రన్ బహదూర్ 12 పరుగులు చేసి అవుట్ అయ్యారు. కాగా వెలసిటి జట్టు 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 174 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. ట్రయల్ బ్లేజర్స్ బౌలర్లలో రాజేశ్వరి గైక్వాడ్, పూనమ్ యాదవ్ చెరో రెండు వికెట్లు తీసుకోగా 16 పరుగుల తేడాతో విజయం సాధించింది.

Untitled Document
Advertisements