లక్ష్మి కుటుంబం గురించి కొన్ని వివరాలు..

     Written by : smtv Desk | Fri, May 27, 2022, 12:58 PM

లక్ష్మి కుటుంబం గురించి కొన్ని వివరాలు..

హైందవ సంప్రదాయంలో లక్ష్మిదేవిని పూజించడం అనేది ప్రతి ఒక్కరికి అలవాటు. ఒక్కో ప్రాంతంలో ఒక్కోవిధంగా లక్ష్మిదేవిని పూజించడం అనేది అలవాటు. కొన్ని చోట్ల గురువారాన్ని లక్ష్మివారంగా పరిగణిస్తే మరి కొన్ని చోట్ల శుక్రవారాన్ని లక్ష్మివారంగా పరిగణిస్తారు. లక్ష్మీదేవిని సంపదకు ప్రతీకగా భావిస్తారు. అయితే ఈ లక్ష్మీదేవి కుటుంబం గురించి ఎవరికీ తెలియని కొన్ని విషయాల గురించి తెలుసుకుందాం .
మహాలక్ష్మీదేవి మన అందరి దైవం. ఆమె గోత్రం 'భార్గవ' తల్లి పాల సముద్రం, తండ్రి భృగుమహర్షి, తమ్ముడు చంద్రుడు, కోడలు సరస్వతి, భర్త శ్రీహరి, పుత్రులు ఆనందుడు, కర్దముడు, చక్లితుడనే ముగ్గురు ఋషులు. కృతయుగంలో ఈమె పేరు శ్రీ మహాలక్ష్మి, భర్త శ్రీహరి. త్రేతాయుగంలో ఈమె పేరు సీత, భర్త శ్రీరామచంద్రుడు. ద్వాపరయుగంలో ఈమె పేరు రుక్మిణి, భర్త శ్రీకృష్ణ పరమాత్ముడు. కలియుగం లో ఈమె పేరు అలర్మేర్ మంగ(అలర్ - పుష్పాల యొక్క, మేర్ - పై భాగంలో కన్పిస్తూ దర్శమిచ్చిన, మంగ - కన్నె. ఈమె పేరే పద్మావతి. పద్మాలలో దాగి పుట్టినది) ఈమెనే ' అల మేలు మంగ ' అన్నారు. భర్త శ్రీ వేంకటేశ్వరుడు. కృతయుగంలో వైకుంఠంలో, త్రేతాయుగంలో అయోధ్యలో, ద్వాపరయుగంలో మధురలో, కలియుగములో తిరుమలలో ఈమె నివాసము.





Untitled Document
Advertisements