ఆంధ్రప్రదేశ్ లో సరికొత్త వ్యూహాలతో ఎర్రచందనం స్మగ్లింగ్..

     Written by : smtv Desk | Fri, May 27, 2022, 01:00 PM

ఆంధ్రప్రదేశ్ లో సరికొత్త వ్యూహాలతో ఎర్రచందనం స్మగ్లింగ్..

ఆంధ్రప్రదేశ్లో ఎర్రచందనం స్మగ్లర్లు సరి కొత్త ఎత్తుగడలతో ఎర్ర చందనాన్ని సప్లై చేస్తూ పోలీసులకు దొరికిపోయారు. మీరు ఎన్ని వ్యూహాలు వేసుకుంటూ స్మగ్లింగ్కు పాల్పడ్డ పోలీసులు మాత్రం వీరిని వదలడం లేదు . అయితే ఆంధ్రప్రదేశ్లో స్మగ్లింగ్కు పాల్పడ్డ వారిలో చాలా వరకు తమిళనాడుకు చెందిన వారే కావడం గమనార్హం. అయితే చిత్తూరు జిల్లా నుండి ఇ ఎర్రచందనాన్ని స్మగ్లింగ్ చేస్తున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. చిత్తూరు తూర్పు సీఐ బాలయ్య ఎస్సై రామకృష్ణ లు చిత్తూరు మరియు వేలూరు మధ్య రోడ్డు లోని మాపాక్షి వద్ద వాహనాల తనిఖీలు నిర్వహించారు. అందులో భాగంగానే అనుమానాస్పదంగా కనిపించిన ఒక అంబులెన్స్ ను తనిఖీ చేయగా ఇందులో ఎర్రచందనం దుంగలు మరియు చెట్లను నరక డానికి గొడ్డళ్ళు వంటివి కనబడటంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు . అంతేకాక మరొకచోట వీళ్ళ సరఫరాకు ఉపయోగించే ఆటోలో ఎర్రచందనం నుంచి తీసుకెళ్తుండగా పోలీసులు పట్టుకున్నారు. అయితే ఈ పట్టుబడ్డ వాహనాలు అన్ని తమిళనాడు వైపు వెళ్తుండటం మరియు స్మగ్లింగ్కు పాల్పడ్డ వారిలో తమిళనాడుకు చెందిన యువకులు ఎక్కువగా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ విధంగా అనేక పథకాలు వేస్తూ ఎర్రచందనం ఆంధ్ర ప్రదేశ్ నుండి ఎర్ర చందనాన్ని స్మగ్లింగ్ చేస్తున్నారు.





Untitled Document
Advertisements