పంచమాంగల్యాలు అనగానేమి? వాటి ప్రాముఖ్యత ఏమిటి?

     Written by : smtv Desk | Fri, May 27, 2022, 01:11 PM

పంచమాంగల్యాలు అనగానేమి? వాటి ప్రాముఖ్యత ఏమిటి?

భారతసంప్రదాయంలో వివాహం జరిగిన ప్రతి స్త్రీ భర్త క్షేమం కోసం అయిదవతనం ఉట్టిపడేలావిధిగా ధరించవలసిన కొన్ని అలంకారాలనే పంచమాంగల్యాలు అంటారు.
అయితే పాచత్య సంస్కృతి విచ్చలవిడిగా విస్తరిస్తున్న తరుణంలో మన సంస్కృతి సంప్రదాయాలను పక్కన పడేసి చిట్టిపొట్టి బట్టలతో, చిప్పిరి జుట్టు, బొట్టు, గాజులు లేకుండా బోసి మెడతో జూలోని జంతువులలా అమ్మాయికి అబ్బాయికి తేడా తెలుసుకోలేని విధంగా తయరువుతున్నారు.
నిజానికి వివాహమైన స్త్రీలు ఈ పంచ మాంగల్యాలు అన్నివేళలా ధరించి నట్టింట్లో మహాలక్ష్మిలా తిరుగుతూ భర్తకి ఇంట్లో వాళ్లందరికీ కనిపిస్తే గనుక భర్తకి ఆయుష్షు వృద్ధి, మెట్టినింట్లో లక్ష్మీ వృద్ధి  అవుతాయని మన పురాణాలు చెబుతున్నాయి... కానీ నేటి పాశ్చాత్య సంస్కృతిలో స్త్రీలు ఆ పంచమాంగల్యాలకి విలువ లేకుండా చేస్తున్నారు.  బొట్టు, గాజులు ధరించడం అంటే రాష్ వస్తుంది అంటారు. పువ్వులు పెట్టుకొని అంటే ఓల్డ్ ఫ్యాషన్ అంటారు. మంగళ సూత్రాలను, మెట్టెలను అలంకరణ వస్తువులు గా చూస్తున్నారు. ఇంతకీ ఈ పంచమాంగల్యాలు ఏంటో చూసేద్దామా..
నుదుట, పాపిట కుంకుమ, మెడలో మాంగల్యం, తలలో పూలు, చేతులకు గాజులు, కాలికి మెట్టెలు. ఇవే పంచమాంగల్యాలు. ఈ ఐదు వివాహమైన స్త్రీ అన్నివేళలా ధరించాలి. భర్తకి ఇవన్నీ ధరించే కనిపించాలి. భార్య గనుక అన్నివేళలా భర్తకు ఇలా కనిపిస్తే భర్త ఆయుషు పెరుగుతుంది అని మన పురాణాలలో పేర్కొనబడింది.





Untitled Document
Advertisements