హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాష్ చౌతాలా కి మరో నాలుగేళ్లు జైలు శిక్ష..

     Written by : smtv Desk | Fri, May 27, 2022, 04:39 PM

హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాష్ చౌతాలా కి మరో నాలుగేళ్లు జైలు శిక్ష..

ఇండియన్ లోక్ దళ్ మాజీ అధ్యక్షుడు హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాష్ చౌతాలాకు మరోసారి నాలుగేళ్ల జైలు శిక్ష విధిస్తూ ఢిల్లీ కోర్టు శుక్రవారం తీర్పునిచ్చింది. అంతేకాక 50 లక్షల జరిమానా కూడా విధించింది. గతంలో హర్యానాలో అనర్హత గల వ్యక్తులను ఉపాధ్యాయులుగా నియమించారని కేసులో నిజా నిజాలు వెళ్లడం వల్ల ఈయనకు 10 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. అయితే ప్రస్తుతం ఈయన చర్చ పూర్తి చేసుకుని ఏడాది గడిచినా సమయంలో ఆయనకు మళ్లీ చుక్కెదురైంది. ఆయన సంపాదనకు మించిన ఆస్తులు ఉన్నాయని అంశంపై ఈడీ అధికారులు దర్యాప్తు చేయగా ఆయనకు మళ్లీ నాలుగేళ్ల జైలు శిక్షను ఖరారు చేస్తూ 50 లక్షల జరిమానా ఢిల్లీ కోర్ట్ విధించింది. అంతేకాక ఆయనకు సంబంధించిన నాలుగు ఆస్తులను కూడా జప్తు చేయాలని కోర్టు ఈడీ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. 10 సంవత్సరాల జైలు జీవితం గడిపి బయటకు వచ్చిన ఒక సంవత్సరంలోనే మళ్లీ నాలుగు సంవత్సరాల పాటు జైలు జీవితం గడపడానికి ఆయన సిద్ధమయ్యారు.

Untitled Document
Advertisements