కేసిఆర్ దేశవ్యాప్త రాజకీయాల్లోకి ఎప్పుడు వెళ్తున్నారో క్లారిటీ ఇచ్చిన మంత్రి మల్లారెడ్డి

     Written by : smtv Desk | Fri, May 27, 2022, 05:47 PM

కేసిఆర్ దేశవ్యాప్త రాజకీయాల్లోకి ఎప్పుడు వెళ్తున్నారో క్లారిటీ ఇచ్చిన మంత్రి మల్లారెడ్డి

తెలంగాణ ప్రభుత్వం మంత్రి మల్లారెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఎప్పుడూ దేశ రాజకీయాల్లోకి ప్రవేశిస్తారు అనే దానిపై ఒక క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికే దేశవ్యాప్త రాజకీయాలలోకి వెళ్లడానికి ప్రయత్నాలు చేస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఏ సమయంలో దేశవ్యాప్త రాజకీయాల్లోకి వస్తారని దానిపై మంత్రి మల్లారెడ్డి వివరించారు. హనుమకొండ పర్యటన లో ఉన్నా మంత్రి మల్లారెడ్డి పలువురు కార్మిక సంఘాల నేతలతో సమావేశమైన అనంతరం అక్కడ మీడియా విలేకరులతో మాట్లాడుతూ.. ఇప్పుడు దేశానికి ప్రధాన మంత్రిగా వ్యవహరిస్తున్న నరేంద్ర మోడీ దేశానికి పెద్దదిక్కుగా ఉంటారనుకుంటే ఆయన ఒక్కసారి వాడి లాగా ప్రవర్తిస్తున్నారని వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ కేవలం తెరాస మాత్రమే అభివృద్ధి చేసిందని భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్లో తెలంగాణ అభివృద్ధికి ఏమాత్రం కృషి చేయలేదని చెప్పుకొచ్చారు. అయితే ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో భారతీయ జనతా పార్టీ రాబోయే ఎన్నికలలో గెలవదని అప్పుడు ఎన్నికల్లో పోటీ చేస్తున్న మన ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుకు కార్మిక సంఘాలు అన్ని మద్దతు తెలపాలని పిలుపునిచ్చారు. అయితే రాబోయే విజయదశమి రోజున భద్రకాళి అమ్మవారి దర్శనం చేసుకొని తెలంగాణ ముఖ్యమంత్రి దేశవ్యాప్త రాజకీయాలలోకి వెళ్లనున్నట్లు మంత్రి మల్లారెడ్డి వెల్లడించారు.

Untitled Document
Advertisements