వేసవిలో పరిపూర్ణ ఆరోగ్యానికి కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి

     Written by : smtv Desk | Fri, May 27, 2022, 06:05 PM

వేసవిలో పరిపూర్ణ ఆరోగ్యానికి కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి

వేసవిలో పరిపూర్ణ ఆరోగ్యానికి పరిపూర్ణ ఆహారం, తగినంత విశ్రాంతి, మండుటెండ నుంచి రక్షణ,చిన్న చిన్న చిట్కాలు,అవసరమైన వైద్యుల  సలహాలు వేసవిని ఎదుర్కోవడానికి, ఇంతకుమించి జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాలి. అందుకోసం ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ తప్పనిసరిగా తీసుకోవాలి. ఉదయాన్నే ఏదో ఒకటి కడుపులో పడ్డకే కాలు బయట పెట్టాలి లేదంటే నిస్సత్తువ ఆహ్వానిస్తూ.. ఎండకు ఆకలి మందగిస్తుంది. ఫలితంగా, పోషక విలువల లోపం ఏర్పడుతుంది. మంచి భోజనం,పండ్లు, కూరగాయల ముక్కలు శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తాయి. మద్యం, కాఫీ, టీ,ధూమపానం వంటివి ఒంట్లోని నీటినిల్వల్ని అడుగంటేలా చేస్తాయి . కాబట్టి వాటి జోలికి వెళ్లకపోవడమే మంచిది. మసాలా రుచులు ఎంత తగ్గిస్తే అంత మంచిది. వేపుడు కూరలు, సమోసాలు, మిర్చిబజ్జీలకు ఆమడ దూరంలో ఉండాలి. అవే కాదు, కొవ్వు ఎక్కువ ఉన్న ఏ పదార్థమైనా దూరం దూరం. ఎందుకంటే ఎండ వేడి కొవ్వుపై చెడు ప్రభావం చూపుతుంది. వేసవి ప్రకృతి పెట్టే పరీక్ష. పరిష్కారం కూడా ప్రకృతి లోనే ఉంది... పాలకూర, కీరా,అల్లం,వెల్లుల్లి,బీట్రూట్ వంటివి వేసవి దెబ్బను తట్టుకునే శక్తిని ఇస్తాయి. నీరు అధికంగా ఉండే సొరకాయ, టమాటా,దోసకాయ,పుచ్చకాయ ఎక్కువ తీసుకోవాలి. సొరకాయ అరికాళ్లకు రుద్దుకుంటే వేడి తగ్గిపోతుందని, మొహం మీద కీరా దోసకాయ ముక్కలు పెట్టుకుంటే హాయిని ఇస్తుందని, నుదుటి మీద మంచి గంధం రాసుకుంటే చలువ చేసి హాయ్ హాయిగా ఉంటుందని, రోజ్ వాటర్ ని రిఫ్రిజిరేటర్ ఐస్ క్రీమ్ లో పెట్టేసి ఆ ముక్కలతో ఒళ్ళంతా రుద్దుకుంటే ఆనందమే ఆనందం అని ఇలా చాలా చిట్కాలే ప్రపంచంలో ఉన్నాయి. వీటివల్ల వేసవి సమస్యలకు పరిపూర్ణ పరిష్కారం దొరుకుతుందని చెప్పలేము  కానీ, ఎంతో కొంత ఉపశమనం అయితే కచ్చితంగా లభిస్తుంది.





Untitled Document
Advertisements