చంద్రబాబు పై బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు..

     Written by : smtv Desk | Fri, May 27, 2022, 06:21 PM

చంద్రబాబు పై బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు..

ఆంధ్రప్రదేశ్ మంత్రి బొత్స సత్యనారాయణ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పై సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వం సామాజిక న్యాయం పేరిట మొదలుపెట్టిన బస్సు యాత్రలో భాగంగా బొత్స సత్యనారాయణ యాత్రలో పాల్గొన్నారు. అయితే ఈ సందర్భంగా ఆయన మీడియా విలేకరులతో మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు మహానాడు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఈ విషయంపై మాట్లాడుతూ.. నందమూరి తారకరామారావు మృతికి కారణమైన ఆయన ఈ విధంగా మహానాడు కార్యక్రమం జరుగుతున్నాడు అంటూ మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు మహానాడు కార్యక్రమంలో మాట్లాడుతున్న మాటలు ప్రజలు ఎవరు ఆసక్తి చూపడం లేదని ఆంధ్ర ప్రజానీకమంతా చంద్రబాబును నమ్మే పరిస్థితి నుంచి ఎప్పుడు వెళ్లిపోయారని చెప్పుకొచ్చారు. గతంలో చంద్రబాబు నాయుడు ప్రజలు అధికారం ఇస్తే అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేసారని మండిపడ్డారు. అంతేకాక ఆంధ్ర ప్రజానీకము అంతటికి జగన్ పాలనే క్షేమమని మంత్రి పేర్కొన్నారు.

Untitled Document
Advertisements