ఆంధ్ర విశ్వవిద్యాలయంలో అసాంఘిక కార్యక్రమాలు

     Written by : smtv Desk | Sat, May 28, 2022, 11:44 AM

ఆంధ్ర విశ్వవిద్యాలయంలో అసాంఘిక కార్యక్రమాలు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయాలలో ఒకటి అయినా ఆంధ్రవిశ్వవిద్యాలయం ఎంతో ఘనత కలిగినది. ఇక్కడ చదువుకున్న వారు ఎన్నో ఘనతలు సాధించుకుని మంచి మంచి పదవులలో సెటిల్ అయిన వారే ఉన్నారు. అలాంటి ఆంధ్ర యూనివర్సిటీ లో అసాంఘిక కార్యకలాపాలు చేయి దాటిపోయాయి. క్లీన్ ఏయూ పేరిట ఆంధ్ర యూనివర్సిటీలో ప్రక్షాళన జరుపుతుండగా.. యూనివర్సిటీ క్లీనింగ్ యాజమాన్యం చర్యలు తీసుకొని పనిచేస్తుంది అయితే ఇటువంటి సమయంలోనే యూనివర్సిటీ ఆవరణలో ఖాళీ మద్యం బాటిల్ ఎక్కడపడితే అక్కడ కనిపించాయి కుప్పలు కుప్పలుగా ఉన్న వీటిని తొలగించేందుకు జెసిబి సహాయంతో పని చేయిస్తున్నారు. అయితే ఇటువంటి సమయంలోనే మరో అంశం యూనివర్సిటీ లో కలకలం రేపింది. యూనివర్సిటీ లో కొన్నిచోట్ల కండోం ప్యాకెట్లు కుప్పలు కుప్పలుగా కనిపించడం వల్ల యూనివర్సిటీ యాజమాన్యం దిగ్భ్రాంతికి గురయింది. ఎంతోమంది ప్రతిభ గల వారిని బయటకు పంపించి ఉన్నతస్థాయిలో ఉంచిన ఆంధ్ర యూనివర్సిటీలో ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి అనే అంశం పట్ల యూనివర్సిటీ అధికారులు పరేషాన్ అయిపోయారు. ఇక మీదట అయినా ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా ఉండాలని చర్యలను కఠినతరం చేస్తున్నట్లు ప్రకటించారు.

Untitled Document
Advertisements