బ్రెజిల్ లోని విమానాశ్రయంలో పోర్న్ వీడియోలు..

     Written by : smtv Desk | Sat, May 28, 2022, 01:24 PM

బ్రెజిల్ లోని విమానాశ్రయంలో పోర్న్ వీడియోలు..

బ్రెజిల్లోని ఓ విమానాశ్రయంలో డిస్ప్లే టీవీలు హాకింగ్ గురయ్యాయి. ఈ డిస్ప్లే టీవీ లో యాక్టింగ్ గురికావడం వలన వాటిలో ప్లే అయిన వీడియోలు కొద్దిసేపు అందరినీ ఆశ్చర్యపరిచాయి. అయితే ఈ ఎలక్ట్రానిక్ డిస్ప్లే లో పోర్న్ వీడియోలు ప్లే అవ్వడం వలన అధికారులు అంతా ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. వీడియోలను చూసిన వెంటనే అధికారులు అప్రమత్తమై హ్యాకింగ్ కు గురైన డిస్ప్లే లను వెంటనే ఆఫ్ చేసి పోర్న్ వీడియోలు కనిపించకుండా చేశారు. బ్రెజిల్ ఎయిర్ పోర్ట్ అథారిటీ ఇన్ ఫ్రా ఏరో ప్రకటనలు విమానాల సమాచారానికి బదులు ప్రయాణికులకు వాటిల్లో పోర్న్ వీడియోలు చూపించినట్లు తెలిపింది. అందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. సమాచార సేవలను ఔట్ సోర్సింగ్ ద్వారా మరో కంపెనీ నుంచి పొందుతున్నట్లు ఇన్ ఫ్రా ఏరో తన ప్రకటనలో తెలిపారు. ఈ సంస్థ కూడా ఈ మేరకు సమాచారం అందించినట్లు వెల్లడించింది. అయితే ఈ డిస్ప్లేలు హాకింగ్ గురవ్వడం వలన ఎవరు హ్యాకింగ్ చేశారు అనేదానిపై పోలీసులు అధికారులు ఆరా తీస్తున్నారు.

Untitled Document
Advertisements