జగన్ ను అవుట్ డేటెడ్ పొలిటీషియన్ అన్న ఆంధ్రప్రదేశ్ మంత్రి..

     Written by : smtv Desk | Sat, May 28, 2022, 02:53 PM

జగన్ ను అవుట్ డేటెడ్ పొలిటీషియన్ అన్న ఆంధ్రప్రదేశ్ మంత్రి..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన బడుగు బలహీన వర్గాలకు ప్రవేశపెట్టిన పథకాలలో సామాజిక చైతన్య యాత్రలో భాగంగా వైసిపి ఎంపీలు మంత్రులు ఇప్పటికే బస్సు యాత్రలో ఉన్న విషయం. ఈ కార్యక్రమంలో భాగంగానే రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారు నాగేశ్వరరావు ఎన్టీఆర్ జిల్లా గన్నవరం లో పర్యటించారు. అయితే ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన నాగేశ్వరరావు అనుకోని సమయంలో నోరు తప్పి మాటజారారు. అయితే ఈ కార్యక్రమంలో మంత్రి జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను గురించి వివరిస్తూ చంద్రబాబు నాయుడు పై తీవ్రస్థాయిలో విమర్శలు చేసే క్రమంలో చంద్రబాబు అవుట్ డేటెడ్ పొలిటిషన్ అనబోయి జగన్ అవుట్ డేటెడ్ పొలిటిషన్ అని నోరు జారారు. దీంతో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలపై బస్సు యాత్రలో పాల్గొన్న వైసీపీ నేతలు అంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయి ఆయనకు సర్దిచెప్పారు. వెంటనే మంత్రి తన వాదనను వెనక్కి తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

Untitled Document
Advertisements