ఆ ఆల్‌రౌండర్‌కి టీమ్ఇండియాలో చోటు దక్కడం చాలా కష్టం

     Written by : smtv Desk | Sat, Jun 25, 2022, 01:10 PM

ఆ ఆల్‌రౌండర్‌కి  టీమ్ఇండియాలో చోటు దక్కడం చాలా కష్టం

ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో భారత ప్లేయింగ్ ఎలెవన్‌లో ఆల్‌రౌండర్‌ జడేజా చోటు సంపాదించడం చాలా కష్టమని అని భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు. కాగా ప్రపంచ కప్‌కు ఇంకా సమయం ఉన్నప్పటికీ భారత జట్టులో ఎవరు చోటు దక్కించుకుంటారనే దానిపై ప్రస్తుతం చాలా చర్చలు చేస్తున్నారు .ముఖ్యంగా లోయర్ ఆర్డర్‌లో హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్ అద్భుతంగా రాణిస్తుండడంతో జట్టు ఎంపిక చేయడం సెలక్టర్లకు సవాల్‌తో కూడుకున్నవిషయం అని చెప్పుకోవాలి. కాగా ఇటీవల స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌కు గాయం కారణంగా జడేజా దూరమయ్యాడు. అయితే ఐపీఎల్‌-2022లో ఆడిన జడేజా తీవ్రంగా నిరాశ కి గురయ్యాడు . 10 మ్యాచ్‌లు ఆడిన జట్టు .. 116 పరుగులతో పాటు 5వికెట్లు పడగొట్టాడు."ఏడో స్థానంలో దినేష్ కార్తీక్ అద్భుతంగా రాణిస్తున్నాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌లోనూ, ఐపీఎల్‌లోను కార్తీక్ కుమ్మేసాడు . కాబట్టి కార్తీక్‌ స్ధానంలో జడేజా జట్టులోకి రావడం అంత సులభం కాదు అని భావిస్తున్నాను. అదే విధంగా హార్దిక్ పాండ్యా కూడా ఫామ్‌లో ఉన్నాడు. బ్యాటింగ్‌ విషయంలో టీమిండియా పటిష్టంగా కన్పిస్తోంది. అయితే జడేజాకు కూడా జట్టును గెలిపించగల సత్తా ఉంది. చాలా మ్యాచ్‌లలో భారత జట్టును ఒంటి చేత్తో జడేజా గెలుపు తీరాలకు చేర్చాడు. కాబట్టి టీ20 ప్రపంచకప్‌కు భారత జట్టును ఎంపిక చేయడంలో సెలక్టర్ల చేసేవారికి తలనొప్పి రావడం ఖాయమని" సంజయ్ మంజ్రేకర్ పేర్కొన్నాడు .

Untitled Document
Advertisements