డబ్బు గురించి తెలుసుకోవలసిన విషయాలు.. చాణక్యనీతి

     Written by : smtv Desk | Tue, Jun 28, 2022, 12:06 PM

డబ్బు గురించి తెలుసుకోవలసిన విషయాలు.. చాణక్యనీతి

డబ్బు ప్రతి ఒక్కరికి అవసరం.. మరియు, పెరుగుతున్న, ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ డబ్బు లేకపోవడంతో బాధపడుతున్నారు.. డబ్బు మాత్రమే సర్వస్వం.. కాదని కొందరు అంటారు..మరికొందరు జీవితంలోని 70 శాతం సమస్యలు డబ్బుతో పరిష్కారమవుతాయని చెబుతారు అలాగే డబ్బుతో సమస్యలు కూడా తలెత్తుతాయని అంటారు. అయితే ఆచార్య చాణక్య డబ్బు గురించి ఏమి చెప్పారో ఇప్పుడు తెలుసుకుందాం..
పొదుపు చేయాలి రాబోయే కష్టకాలాన్ని గుర్తించి, ముందుగానే డబ్బును పొదుపు చేసుకోవాలి. పొదుపు చేయవలసిన డబ్బు ఖర్చు చేయవలసి వచ్చినప్పటికీ అవసరమైన మేరకే ఖర్చు చేయాలి. సంపద అనేది జీవితంలో ఒక ముఖ్య భాగం గౌరవం ఇవ్వాలి .. ఇది మనిషికి గౌరవాన్ని అందిస్తుంది. ఊహించని విపత్తులను ఎదుర్కోవడానికి సాయపడుతుంది.
డబ్బు ఉన్న చోటునే ఉండండి కానీ ఉపాధి, గౌరవం, శ్రేయోభిలాషులు, విద్య లభించని ప్రాంతంలో నివసించడం వల్ల ఉపయోగం లేదు. సంపన్నులు, వ్యాపారులు, విద్యావంతులైన బ్రాహ్మణులు, సైనికులు, నదులు, వైద్యులు ఉన్న చోటునే మనిషి నివసించాలి. నిజాయితీకి పరీక్ష మీరు డబ్బు లేదా ఆస్తిని పోగొట్టుకున్నప్పుడు మీ భార్యలోని అసలైన నైజం బయటపడుతుంది. డబ్బు సాయంతో మీ స్నేహితులను, సేవకులను పరీక్షించండి. అప్పుడే వారి నిజాయితీ బయటపడుతుంది. త్యాగం అవసరం కష్టపడి సంపాదించిన ధనంలో కొంత భాగాన్ని దానధర్మాలకు వినియోగించాలి. అవసరమైనప్పుడు ధనాన్ని త్యాగం చేయవలసి ఉంటుంది.





Untitled Document
Advertisements