నెక్స్ట్ లెవల్ లో మేజ‌ర్‌ షెడ్యూల్ ప్రారంభం ..

     Written by : smtv Desk | Tue, Jun 28, 2022, 12:30 PM

నెక్స్ట్ లెవల్ లో  మేజ‌ర్‌ షెడ్యూల్ ప్రారంభం ..

ప్ర‌భాస్ ప్ర‌స్తుతం వ‌రుస‌ పాన్ ఇండియా సినిమాల‌తో బిజీ గా అయిపోయాడు . ఇటీవ‌లే ‘రాధేశ్యామ్‌’తో ప్రేక్ష‌కుల‌ను తీవ్రంగా నిరాశ ప‌రిచిన ప్ర‌భాస్ త‌న త‌దుప‌రి సినిమాల‌పై ఫుల్ ఫోక‌స్‌ పెట్టాడు. ప్ర‌స్తుతం ఈయ‌న చేతిలో నాలుగు సినిమాల‌నున్నాయి. అందులో ప్ర‌శాంత్‌నీల్ ప్రాజెక్ట్ ఒక‌టి. ఇప్ప‌టికే ఈ కాంబోపై ప్రేక్ష‌కుల‌లో భారీ స్థాయిలో అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఇక ‘కేజీఎఫ్ చాప్ట‌ర్-2’ చూసిన త‌ర్వాత స‌లార్ సినిమాపై అంచ‌నాలు తారా స్థాయికి చేరాయి. చాప్ట‌ర్‌-2 చూసిన ప్రేక్ష‌కులు స‌లార్‌లో ప్రభాస్‌ను నీల్ ఏ రెంజ్‌లో చూపిస్తాడో అని ఆత్రుత‌ మొద‌లైంది. ఇదిలా ఉంటే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్‌ అప్‌డేట్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. స‌లార్ మేజ‌ర్‌ షెడ్యూల్ మంగ‌ళవారం హైద‌రాబాద్‌లో ప్రారంభ‌మైంది. ఈ షెడ్యూల్‌లో ప్ర‌శాంత్‌నీల్ యాక్ష‌న్ స‌న్నివేశాలను చిత్రీక‌రించ‌నున్నాడు. ఈ చిత్రంలో ప్ర‌భాస్ డ్యూయ‌ల్ రోల్‌లో న‌టించ‌నున్నాడు. శృతి హాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రానికి ర‌విబ‌స్రూర్ సంగీతం ఇచ్చారు . 60శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇక ప్ర‌భాస్ లేటెస్ట్‌గా న‌టించిన‌ ‘ఆదిపురుష్’ వ‌చ్చే సంవత్సరం జ‌న‌వ‌రి 12న విడుద‌ల కానుంది. మైథ‌లాజిక‌ల్ డ్రామాగా తెర‌కెక్కిన ఈ చిత్రాన్ని ‘త‌న్హాజీ’ఫేం ఓ రౌత్ తెర‌కెక్కించాడు. దీనితో పాటుగా నాగ్ అశ్విన్‌తో ‘ప్రాజెక్ట్-K’ చిత్రాన్ని చేస్తున్నాడు. అత్యంత భారీ బ‌డ్జెట్‌తో పాన్ వ‌ర‌ల్డ్ సినిమాగా ఈ చిత్రాన్ని అశ్వినీద‌త్ తీర్చిదిద్దనున్నారు .

Untitled Document
Advertisements