దక్షిణ కన్నడ జిల్లాల్లో భూకంపం.. భయందోలనలో అక్కడి ప్రజలు

     Written by : smtv Desk | Tue, Jun 28, 2022, 12:45 PM

దక్షిణ కన్నడ జిల్లాల్లో  భూకంపం.. భయందోలనలో అక్కడి ప్రజలు

కర్నాటకలో మంగళవారం ఉదయం పలు ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. కొడగు, దక్షిణ కన్నడ జిల్లాల్లో ఉదయం 7.45 గంటల ప్రాంతంలో ప్రకంపనలు సంభవించాయి . మూడు నుంచి ఏడు సెకన్ల పాటు ప్రకంపనలు నమోదయ్యాయి. దీంతో జనం భయాందోళన చెందారు . ఇండ్ల నుంచి పరుగులు పెట్టారు. గత మూడు రోజుల్లో ప్రకంపనలు రావడం ఇది మూడోసారి. సుల్లియా పరిసర ప్రాంతాల్లో రెండోసారి ప్రకంపనలు రికార్డయ్యాయి. ఇండ భారీ శబ్దంతో ప్రకంపనలు వచ్చినట్లు స్థానికులు తెలిపారు. ప్రకంపనల సమయంలో ఫర్నీచర్‌, రూఫింగ్‌ టాప్‌ షీట్లతో పాటు ఇంట్లో వస్తువులు కదిలాయని పేర్కొన్నారు. మూడు రోజుల క్రితం సుల్లియాతో పాటు పరిసర ప్రాంతాల్లో రిక్టర్ స్కేల్‌పై 2.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. మంగళవారం రిక్టర్‌ స్కేల్‌పై 3.5 తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మోలజీ తెలిపింది. బెంగళూరుకు 238 కిలోమీటర్ల దూరంలో, భూమికి ఐదుకిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం గుర్తించినట్లు పేర్కొంది. కర్నాటక రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ భూకంపాలను నిశితంగా ఎప్పటికప్పుడు తెలుపుతుంది .





Untitled Document
Advertisements