హత్య కేసులో నిందితుడికి బుద్ది చెప్పిన న్యాయమూర్తి

     Written by : smtv Desk | Tue, Jun 28, 2022, 01:07 PM

హత్య కేసులో నిందితుడికి బుద్ది చెప్పిన న్యాయమూర్తి

యువకుడిని అతి దారుణంగా హత్య చేసిన వ్యక్తికి యావజ్జీవ జైలు శిక్ష.. విధిస్తూ నగరంలోని 11వ అదనపు జిల్లా న్యాయమూర్తి లాలం శ్రీధర్‌ సోమవారం తీర్పు చెప్పారు. జరిమానా చెల్లించని విదంగా 3 నెలలు కచ్చితంగా జైలు శిక్ష అనుభవించాలని కోర్ట్ తీర్పు ఇచ్చింది. అదనపు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ సలాది శ్రీనివాసు అందించిన వివరాలు. నిందితుడు పడాల నాగరాజు నలబైరెండు ఉమ్మడి విశాఖ జిల్లా కొయ్యూరు మండలం చట్టుబంద గ్రామానికి చెందిన వ్యక్తి.అతని వృత్తి వ్యవసాయం.మృతుడు కె.మల్లేశ్వరరావు కూడా అదే గ్రామానికి చెందినవాడు. నేరం జరగడానికి 6 నెలల ముందు నాగరాజు కూలి పనుల నిమిత్తం చెన్నై వెళ్లాడు.నగరానికి తిరిగి వచ్చిన తర్వాత అతని ఇంట్లో ఆధార్‌ కార్డు, రేషన్‌ కార్డు, రేడియో లాంటివి ఇంట్లో కొన్ని వస్తువులు కనిపించలేదు. వాటిని మల్లేశ్వరరావు దొంగలించినట్లు అనుమానం వచ్చింది. ఈ విషయంలో ఇద్దరూ గొడవ పడ్డారు. 2015 జూన్‌ 3న రాత్రి మల్లేశ్వరరావు లోతభీమయ్యకు చెందిన జీడి మామిడితోటలోని పూరిపాకలో నిద్రపోతున్నాడు. ఇదే అదునుగా నాగరాజు అర్ధరాత్రి 12 గంటలకు పెద్ద కర్రతో తలపై, బుజంపై,ముక్కుపై మల్లెశ్వరరావుపై దాడి చేసాడు.తీవ్ర గాయాలతో బాధపడుతున్న మల్లేశ్వరరావును అతని బంధువులు నర్సీపట్నం ప్రాంతీయ వైద్యశాలకు తీసుకువెళ్ళారు. మంచి వైద్యం కోసం అక్కడి నుంచి విశాఖ తరలించారు. చికిత్స పొందుతూ జూన్‌ 4న మరణించాడు. మృతుని తండ్రి కొయ్యూరి లక్ష్మయ్య ఫిర్యాదు మేరకు కొయ్యూరు పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ జి.సోమశేఖర్, నర్సీపట్నం ఉప పోలీస్‌ సూపరింటెండెంట్‌ బి.సత్య ఏసుబాబు కేసు నమోదు చేసారు. హత్యా నేరంతోపాటు, గిరిజన చట్టం 3(2)(5) కింద కూడా నేరం రుజువుకావడంతో న్యాయమూర్తి రెండు నేరాల్లో జైలు శిక్ష విధించారు. అయితే 2 శిక్షలు ఏకకాలంలో అమలు చేయాలని ఆ తీర్పులో స్పష్టం చేశారు.





Untitled Document
Advertisements