ఆ సినిమా సక్సెస్ మీట్ సందడిగా జరుపుకున్న సినిమా నటులు..

     Written by : smtv Desk | Tue, Jun 28, 2022, 01:18 PM

ఆ సినిమా సక్సెస్ మీట్ సందడిగా జరుపుకున్న సినిమా నటులు..

ఆకాష్ పూరి, గెహనా సిప్పీ హీరో హీరోయిన్లుగా దర్శకుడు జీవన్ రెడ్డి తెరకెక్కించిన చిత్రం చోర్ బజార్. సినిమా ఐవీ క్రియేషన్స్ పతాకంపై వీఎస్ రాజు నిర్మించారు. యూవీ క్రియేషన్స్ సమర్పణలో తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చిన సినిమా. ఫస్ట్ షో నుంచే హిట్ టాక్ తెచ్చుకుని మాస్ క్లాస్ తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో సినిమా సక్సెస్ మీట్ ను హైదరాబాద్ లో నిర్వహించారు.
మాస్ హీరోగా మెప్పించాననే పేరు ఈ సినిమాతో నాకు దక్కింది అంటున్న హీరో ఆకాష్ పూరి.. నేను జనాల్లోకి హీరోగా వెళ్లిపోయాను అనే ప్రశంసలు దక్కుతున్నాయి. ఆ క్రెడిట్ మొత్తం దర్శకుడు జీవన్ రెడ్డికి ఇవ్వాలి. సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతోంది. ఫైట్ మాస్టర్ పృథ్వీ కంపోజ్ చేసిన యాక్షన్ సీన్స్ ఆకర్షణగా నిలిచాయని అన్నారు. అలాగే సంగీతం, సినిమాటోగ్రఫీ, ఆర్ట్ వర్క్ ఇలా ప్రతి టెక్నీషియన్స్ అంతా ప్రతిభ చూపించారు. ఇంతకు ముందు చేసిన రెండు చిత్రాల కన్నా చోర్ బజార్ గ్రాండ్ గా ఉందని అంటున్నారు. దానికి కారణం వీఎస్ రాజు. నాకు ఈ సినిమా చాల బ్యూటిఫుల్ మెమొరీస్ ఇచ్చింది.
చోర్ బజార్ తో ఒక కలర్ ఫుల్ కమర్షియల్ సినిమా చేయాలనుకున్న మా ప్రయత్నం ఇప్పుడు సక్సెస్ అయ్యింది అంటూ ఆనందంగా చెపుతున్న దర్శకుడు జీవన్ రెడ్డి.. అన్ని ప్లేసాస్ ల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. నేను ఫస్ట్ టైమ్ ఒక కమర్షియల్ సినిమా చేశాను. ఈ సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు థాంక్స్. ఆకాష్ తో పాటు మిగతా టీమ్ అంతా నాకెంతో సపోర్ట్ చేశారు. ఇకపైనా మంచి కమర్షియల్ చిత్రాలు చేయాలని అనుకుంటున్నాను.
సినిమా కోసం ఆడియెన్స్ అందరికీ థాంక్స్ చెపుతున్న నిర్మాత వీఎస్ రాజు.. సినిమా కోసం మేము పడిన శ్రమకు మీ వాళ్ళ ఫలితం దక్కింది. మీ ఆదరణతో మరిన్ని మంచి చిత్రాలను నిర్మిస్తాం అన్నారు.
సహ నిర్మాత సురేష్ వర్మ ఇలా అన్నాడు ఈ నెల 24న మా సినిమా విడుదలవుతుందని తలియగానే ఓ మాస్ మూవీ చూడాలని ఫిల్మ్ లవర్స్ ఎదురుచూశారు. ఇవాళ వాళ్లకు సినిమా బాగా నచ్చింది. బీ, సీ సెంటర్స్ లో ఆదరణ ఎక్కువగా వస్తోంది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 550 థియేటర్లలో చోర్ బజార్ సినిమాను విడుదల చేశాం. అన్ని చోట్లలో కలెక్షన్ బాగా వచ్చింది. నా మిత్రుడు వీఎస్ రాజు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాను నిర్మించారు. మాకు సపోర్ట్ చేసిన ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరికీ థాంక్స్ అన్నారు.
ఈ సినిమాలో నేను మూడు పాటలు రాశాను అంటున్న గీత రచయిత మిట్టపల్లి సురేందర్.. ఆడియోకు మంచి రెస్పాన్స్ వస్తోంది. బచ్చన్ సాబ్ పాటకు థియేటర్ లో రీసౌండ్ వస్తోంది. చోర్ బజార్ ను సక్సెస్ చేసిన అందరికీ చాల థాంక్స్ అన్నారు.





Untitled Document
Advertisements